ధోనీ వైపు చూసి ‘ఈరోజు కాదు’ అని చెప్పా : బంగ్లా క్రికెటర్

540
i slid back and told dhoni not today sabbir rahman
i slid back and told dhoni not today sabbir rahman

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. బ్యాటింగ్ లో ఎలాంటి సత్తా చాటుతాడో.. అలానే వికెట్ల వెనుక నుంచి రెప్పపాటులో బెయిల్స్‌ని ఎగరగొట్టడంలో ధోనీ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. బ్యాట్స్‌మెన్ పాదలను రెప్పపాటులో కనిపెట్టేసి స్టంపౌట్‌ చేయగలడు ధోని. కానీ.. 2019 వన్డే ప్రపంచకప్‌‌లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ షబ్బీర్ రెహ్మాన్‌ని స్టంపౌట్ చేయడంలో మహేంద్రసింగ్ ధోనీ కాస్త తడబడ్డాడు.

దాంతో “ఈ రోజు నీకు ఆ ఛాన్స్ లేదు ధోనీ” అని తాను చెప్పినట్లు షబ్బీర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. “2016 టీ20 వరల్డ్‌కప్‌లో ధోనీ నన్ను స్టంపౌట్ చేశాడు. ఆ తర్వాత 2019 వన్డే ప్రపంచకప్‌లోనూ ధోనీకి ఆ ఛాన్స్ లభించింది. కానీ ఆ మ్యాచ్ లో నేను తెలివిగా మళ్లీ క్రీజులోకి రాగలిగాను. దాంతో.. ధోనీ వైపు చూసి ‘ఈరోజు నీది కాదు’ అని చెప్పా’’ అని షబ్బీర్ వెల్లడించాడు.

అయితే ఆ మ్యాచ్ లో బుమ్రా బౌలింగ్ లో షబ్బీర్ 36 పరుగుల వద్ద ఔటవగా.. బంగ్లాదేశ్‌ని 28 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మహేంద్రసింగ్ ధోనీ.. ఇప్పటి వరకూ 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో మొత్తం 195 స్టంపౌట్స్ చేశాడు.

Loading...