Friday, April 26, 2024
- Advertisement -

క్రికెట్ దేవుడు స‌చిన్‌కు ఐసీసీ మ‌రో అరుదైన గౌర‌వం…

- Advertisement -

క్రికెట్ చ‌రిత్ర‌లో ఎన్నో రివార్డులు, అవార్డులు అందుకున్న స‌చిన్ టెండుల్క‌ర్‌కు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం లభించింది. అతడితో పాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ అలన్‌ డోనాల్డ్‌, ఆసీస్‌ మాజీ మహిళా క్రికెటర్‌ క్యాథిరిన్‌ ఫిట్జ్‌పాట్రిక్‌లకు ఈ అవకాశం లభించింది.

లండన్‌లో నిర్వహించిన ఐసీసీ హాల్ ఆఫ్‌ ఫేమ్‌ కార్యక్రమంలో సచిన్‌ పాల్గొని మాట్లాడారు. తనకు లభించిన ఈ గుర్తింపు పట్ల చాలా సంతోషంగా ఉందని, ఇది తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అటు టెస్టులు, ఇటు వన్డేల్లో అత్యధిక పరుగులతోపాటు వంద శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్‌ సచిన్‌ అని ఐసీసీ కొనియాడింది. ‘లెజెండ్‌ అనే పదం సచిన్‌కి తక్కువే.. తాజాగా ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ఆయనకి స్థానం కల్పించాం’ అని ఐసీసీ ట్వీట్‌ చేసింది. సౌతాఫ్రికాకు చెందిన 52 ఏళ్ల అల‌న్ డోనాల్డ్ 2003లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అత‌ని ఖాతాలో 330 టెస్టు, 272 వ‌న్డే వికెట్లు ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -