Saturday, April 27, 2024
- Advertisement -

భార‌త్ టెస్ట్ నెంబ‌ర్ 1ర్యాంకింగ్ చేజారుతుందా….?

- Advertisement -

భార‌త్ టెస్టుల్లో నెంబ‌ర్ 1 ర్యాంకింగ్‌లో ప్ర‌స్తుతం కొనసాగుతోంది. అయితే నెబ‌ర్ వ‌న్‌కు ముప్పు వ‌చ్చేలా ఉంది. శ్రీల‌కంతో జ‌రిగిన టెస్ట్ సిరీస్‌లో 3-0తో ఇంగ్లండ్ వైట్ వాష్ చేయ‌డంతో ఐసీసీ ప్ర‌క‌టించిన తాజా టెస్ట్ ర్యాంకిగ్స్‌లో రెండో స్థానానికి ఎగ‌బాకింది.
భారత్ జట్టు ప్రస్తుతం 116 పాయింట్లతో నెం.1 స్థానంలో కొనసాగుతుండగా.. 108 పాయింట్లతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో నిలిచింది. డిస్సెంబ‌ర్ 6 నుంచి ఆసిస్‌తో నాలుగు టెస్ట్‌లు ఆడ‌నుంది. టెస్టుల్లో అగ్ర‌స్థానానిన్ని నిల‌బెట్టు కోవాలంటే భార‌త్ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయాలి లేకుంటే టెస్ట్ నెంబ‌ర్ 1 ర్యాంకును నిల‌బెట్టుకోవ‌డం క‌ష్టం.

తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ జాబితాని ఓ సారి పరిశీలిస్తే..! భారత్ 116 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాత వరుసగా ఇంగ్లాండ్ (108), దక్షిణాఫ్రికా (106), న్యూజిలాండ్ (102), ఆస్ట్రేలియా (102), పాకిస్థాన్ (95), శ్రీలంక (97), వెస్టిండీస్ (63), బంగ్లాదేశ్ (63), జింబాబ్వే (13) టాప్-10లో నిలిచాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -