ఓట‌మిపై భావోద్వేగంపై స్పందించిన రోహిత్ శ‌ర్మ‌…..

304
IND vs NZ : Rohit Sharma Feels 30 Minutes Took it Away From India as They LostWorld Cup 2019 Semi-Final 1
IND vs NZ : Rohit Sharma Feels 30 Minutes Took it Away From India as They LostWorld Cup 2019 Semi-Final 1

సెమీఫైన‌ల్లో న్యూజిలాండ్ చేతిలో భార‌త్ ఓట‌మిని ఇంకా అభిమానులు జేర్ణించుకోలేక‌పోతున్నారు. టీమిండియాపై కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తుంటె మ‌రి కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే కెప్టెన్ కోహ్లీ ఓట‌మిపై స్పందించారు. తాజాగా రోహిత్ శ‌ర్మ భావోద్వేగంతో స్పందించారు.

సెమీస్‌లో భారత జట్టు 18 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించడం తెలిసిందే. కీలకమైన సమయంలో జట్టుగా విఫలం చెందినందునే సెమీస్‌లో ఓడిపోయామని పేర్కొన్నాడు. 30 నిమిషాల చెత్త ఆట కారణంగా…ప్రపంచకప్‌ను గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకున్నామని అన్నాడు. మీకులాగానే తనకు కూడా గుండె భారమైయ్యిందని ఆవేదన వ్యక్తంచేశాడు.

దేశం బయట అభిమానుల మద్దతు వెలకట్టలేనిది. యూకేలో మేం ఎక్కడ ఆడినా అక్కడకు వచ్చి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.’ అని రోహిత్‌ ట్వీట్‌ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో 5 సెంచరీలతో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన రోహిత్‌ శర్మ.. కీలక సెమీస్‌ పోరులో మాత్రం ఒకటే పరుగు చేసి ఔటయ్యాడు.

Loading...