Saturday, April 27, 2024
- Advertisement -

ప్రశ్నార్థకంగా శిఖర్ ధావన్ కెరీర్…..?

- Advertisement -

ప్రస్తుతం విండీస్ టూర్ లో టీమిండియా జోరు కొనసాగుతోంది. టీ20 సిరీస్ ను క్లీన్ స్విప్ చేసిన కోహ్లీసేన వన్డేసిరీస్ ను కూడా క్లీన్ స్విప్ చేసేందుకు ఎదురు చూస్తోంది. మూడు వన్డేల్లో భాగంగా మొదటి వన్డే వర్షంతో రద్దవడంతో రెండో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. అయితే ప్రపంచకప్ లో గాయం కారణంగా ఆటకు దూరమయిన ఓపెనర్ శిఖర్ ధావన్ విండీస్ టూర్ కు ఎంపికయ్యారు.

ఈ టూర్ లో శిఖర్ తీవ్ర నిరాశ పరిచారు. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన మూడు టీ20లు, ఒక వన్డే మ్యాచ్‌లో వరుసగా 1, 23, 3, 2 పరుగులతో నిరాశపరిచాడు. దీంతో.. టూర్‌లో మూడో వన్డే రూపంలో ఆఖరి మ్యాచ్‌‌కి సిద్ధమవుతున్న శిఖర్ ధావన్ మరోసారి విఫలమైతే..? అతని కెరీర్ ప్రశ్నార్థకంలో పడనుంది.

వన్డేసిరీస్ పూర్తయిన వెంటనె రెండు టెస్ట్ సిరీస్ లను ఆడనుంది కోహ్లీసేన. శిఖర్ ధావన్‌ స్థానంలో టెస్టులకి మయాంక్ అగర్వాల్‌ని ఓపెనర్‌గా సెలక్టర్లు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఓపెనర్లు శిఖర్ , రోహిత్ తో పాటు కెఎల్ రాహుల్ ఉన్నారు. మూడో వన్డేలో విఫలం అయితే శిఖర్ ఆస్థానం రాహుల్ కు దక్క నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -