Saturday, April 27, 2024
- Advertisement -

ఆసిస్‌ను క‌ట్ట‌డి చేసిన భార‌త బౌల‌ర్లు…ఇండియా టార్గెట్ 237

- Advertisement -

ఆసిస్‌తో ఉప్ప‌ల్‌లో జ‌ర‌గుతున్న మొద‌టి వ‌న్డేలో భారత బౌల‌ర్లు ఆకట్ట‌కున్నారు. ఆసిస్ జ‌ట్టు ఎక్కు వ స్కోరు చేయ‌కుండా అడ్డుక‌ట్ట‌వేశారు. మొద‌ట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్ 7 వికెట్ల న‌ష్టానికి 236 ప‌రుగులు చేసింది. బ్యాటింగ్‌కు దిగిన ఆసిస్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ త‌గిలింది. బామ్రా బౌలింగ్‌లో ఆరోన్ పించ్ ను డ‌కౌట్ చేయ‌డంతో సున్నా స్కోరుకే మొద‌టి వికెట్‌ను కోల్పోయింది. బూమ్రా బౌలింగ్‌లో ఫించ్ ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఈ దశలో ఖవాజా (76 బంతుల్లో 50), స్టోయినిస్ (53 బంతుల్లో 37) ఆసీస్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించారు.

భారీ స్కోరు దిశ‌గా వెలుతున్న జోడీని కేదార్ జాదవ్ విడదీశాడు. స్టోయినిస్‌ను ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి చక్కగా అందుకున్నాడు. ఆఫ్ సెంచ‌రీ చేసుకున్న ఖ‌వాజా కుల్దీప్ బౌలింగ్‌లో ఔట్ చేశాడు. హాఫ్ సెంచరీ చేసుకున్న ఖ‌వాజా భారీ షాట్ ఆడ‌గా….విజ‌య శంక‌ర్ అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్టాడు.

క్రీజులోకి వ‌చ్చి మ్యాక్స్ వెల్ ధాటిగా ఆడాడు. హ్యాండ్స్‌కాంబ్ (19)తో కలిసి ఆసీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. కుల్దీప్ స్లో డెలివరీని ముందుకొచ్చి ఆడే క్రమంలో హ్యాండ్స్‌కాంబ్ స్టంపౌటయ్యాడు. కొత్త కుర్రాడు టర్నర్ (23 బంతుల్లో 21), మ్యాక్స్‌వె‌ల్‌ (51 బంతుల్లో 40).. ఐదో వికెట్‌కు 36 పరుగులు జోడించారు. ఈ దశలో షమీ వరుస ఓవర్లలో వీరిద్దర్నీ బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు.

చివర్లో కౌల్టర్‌ నైల్‌(28), అలెక్స్‌ క్యారీ(36 నాటౌట్‌)లు జాగ్రత్తగా ఆడటంతో ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. భారత బౌలర్లలో షమీ, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రాలు తలో రెండు వికెట్లు సాధించగా, కేదర్‌ జాదవ్‌కు వికెట్ దక్కింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -