Friday, April 26, 2024
- Advertisement -

వ‌న్డేసిరీస్‌కు ముందే ఆసిస్‌కు పెద్ద ఎదురు దెబ్బ‌..

- Advertisement -

ఇటీవ‌లే ఆసిస్ గ‌డ్డ‌పై టెస్ట్ సిరీస్ గెలిచి కోహ్లీసేన చ‌రిత్ర సృష్టించింది. ఏ ఆసియా జ‌ట్టుకు సాధ్యం కాని చ‌రిత్రాత్మ‌క విజ‌యాన్ని న‌మోదు చేసింది. సొంత గ‌డ్డ‌పై ఆసిస్‌ను మ‌ట్టి క‌రిపించి సిరీస్‌ను గెలిచింది. అదే ఊపుతో వ‌న్డేసిరీస్‌పై కూడా దృష్టి సారించింది. మూడు వన్డేల సిరీస్‌లో తలపడే ఆస్ట్రేలియాకు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ త‌గిలింది. సిడ్నీ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి వ‌న్డే కు …ఆ జ‌ట్టు ఆల్‌ రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ దూరమయ్యాడు. జీర్ణాశయ సంబంధిత రోగంతో బాధపడుతున్న మార్ష్‌ కొన్ని రోజులుగా ఆస‍్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

జీర్ణాశయ సమస్యతో బాధపడుతున్న మార్ష్ తొలి వన్డేలో ఆడటం లేదని కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. మిగతా రెండు వన్డేలకు మార్ష్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నాడు. మిచెల్‌ మార్ష్‌ తేరుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అతని స్థానంలో ఆస్టాన్‌ టర్నర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించాడు.

మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ అయిన టర్నర్‌.. పార్ట్‌టైమ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ కావడంతో అతన్ని ఎంపిక చేసినట్లు కోచ్‌ తెలిపాడు. మరొకవైపు ఆస్టన్‌ వికెట్ల మధ్య పరుగెత్తడంలో అథ్లెట్‌ను తలపిస్తాడన్నాడు. బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో ఆస్టన్‌ టర్నర్‌ పెర్త్‌ స‍్కార్చర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -