Saturday, April 27, 2024
- Advertisement -

భారత్ , పాక్ మధ్య మ్యాచ్ లు జరుగుతాయి….? ఎక్కడంటే…?

- Advertisement -

2013 నుంచి భారత్, పాక్ జట్లు కేవలం ఐసీసీ వరల్డ్‌కప్‌, ఆసియా కప్‌లో మాత్రమే తలపడుతుండగా…ద్వైపాక్షిక సిరీస్‌‌ లు మాత్రం జరగడంలేదు. దీనికి అనేకం రాజకీయ కారణాలు ఉన్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాళ్లు పాక్ తో క్రికెట్ సంబంధాలు ఉండవని కేంద్రం మొదటి నుంచి చెప్తూ వస్తోంది. కాని పాక్ మాత్రం చాలా సార్లు ద్వైపాక్షిక సిరీస్‌‌ ఆడదామంటూ గత కొంతకాలంగా దాయాది దేశం బీసీసీఐ ను అభ్యర్థిస్తోంది. పాక్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు ససేమేరా అంటున్న భారత్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఆ ప్రస్తావనే తీసుకురావడం మానేసింది.

తాజాగా సీఓఏ ఛైర్మెన్ వినోద్ రాయ్ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల క్రికెట్ అభిమానుల మధ్య ఆశలు చిగురిస్తున్నాయి.పాక్, భారత్‌లో కాకుండా.. మ్యాచ్‌ల్ని యూఏఈ లాంటి తటస్థ వేదికలపై నిర్వహిస్తామంటే తాము సిద్ధమని చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయం మాచేతుల్లో లేదని కేంద్రం చేతుల్లో మాత్రమే ఉందన్నారు. కేంద్రం ఓకే అంటే తటస్థ వేదికలపై మాత్రమే మ్యాచ్‌లు జరుగుతాయి తప్ప.. ఇరు దేశాల్లో మాత్రం జరగవని చెప్పుకొచ్చారు.

2009లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై లాహోర్‌లో మిలెటంట్లు దాడి చేయగా.. లంక క్రికెటర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇక అప్పటి నుంచి పాక్‌ గడ్డపై మ్యాచ్‌లు ఆడేందుకు ఏ అగ్రశ్రేణి క్రికెట్ జట్టూ సాహసించడం లేదు. దీంతో పాక్ యూఏనీ తటస్థ వేదికగా చేసుకొని క్రికెట్ మ్యాచ్ లు ఆడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -