Friday, April 26, 2024
- Advertisement -

ధోని కెరీర్ ముగిసింది…. గౌరవంగా అతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకో

- Advertisement -

భారత క్రికెట్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన ధోని రిటైర్మెంట్ పై కొంత కాలంగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రపంచకప్ తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తారని అందరూ భావించారు. కాని ధోని మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. సీనియర్లందరూ రిటైర్మెంట్ ప్రకటించాలని వ్యాఖ్యానిస్తున్నారు.

క్రికట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడానికి టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి సమయం ఆసన్నమైందని భారత్ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసిందని అభిప్రాయపడ్డారు.బీసీసీఐ యాజమాన్యం పక్కన పెట్టకముందే… ధీనీ రిటైర్మెంట్ తీసుకోవడం మంచిదని సూచించారు. ధోనీ మనసులో ఏముందో ఎవరికీ తెలయదని… తన భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉన్నాయో ధోనీనే చెప్పాలని అన్నారు.

ధోనీ వయసు ప్రస్తుతం 38 ఏళ్లని… టీ20 ప్రపంచ కప్ సమయానికి ఆయన వయసు 39కి చేరుకుంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో, ధోనీకి ప్రత్యామ్నాయాన్ని బీసీసీఐ అన్వేషించాలని సూచించారు.భారత క్రికెట్ ధోనీ చేసిన సేవలను మరువలేమని… పరుగులు సాధించడమే కాకుండా, అతను చేసిన స్టంపింగులు అద్భుతమని గవాస్కర్ తెలిపారు.

తీ ఒక్కరికీ వ్యక్తిగత జీవితం అనేది ఒకటి ఉంటుందన్నారు. నేను కూడా ధోని అత్యంత గౌరవం ఇస్తాను.. ధోనికి లక్షల సంఖ్యలో ఎలా అయితే అభిమానులు ఉన్నారో, నేను అందులో ఒకడ్ని.ఎవరూ అడగక ముందే ధోనీ తనంతట తాను క్రికెట్ నుంచి తప్పుకోవడం మంచిదని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ధోనీ స్థానంలో జట్టులోకి వచ్చిన రిషభ్ పంత్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడని కితాబిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -