Wednesday, May 8, 2024
- Advertisement -

ధోనీ రీఎంట్రీపై బీసీసీఐ, సెలక్టర్లు చెప్పింది ఇదే..!

- Advertisement -

టీమిండియా మాజీ కెఫ్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రీఎంట్రీపై టీమిండియా కొత్త సెలక్షన్ కమిటీ క్లారిటీ ఇచ్చింది. గత ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకు దూరంగా ఉంటున్న ధోనీ.. అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్‌ రేసులో ఆడాలంటే ఐపీఎల్ 2020 సీజన్‌లో ఫామ్ నిరూపించుకోవాలని తెలిపింది. మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు మొదలు కానున్నాయి.

ఇప్పటికే చెన్నైకి చేరుకున్న ధోనీ చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పదవీకాలం ఇటీవల ముగియగా.. కర్ణాటకకి చెందిన సునీల్ జోషి చీఫ్ సెలక్టర్‌గా గత వారం ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పటికే బాధ్యతలు చేపట్టిన జోషి.. దక్షిణాఫ్రికాతో ఈనెల 12 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్‌కి జట్టుని కూడా ఆదివారం ప్రకటించారు. కానీ.. ధోనీ పేరుని మాత్రం టీమ్ సెలక్షన్ సమయంలో సెలక్టర్లు ప్రస్తావించలేదు.

అయితే.. అనధికారికంగా సెలక్టర్లు, బీసీసీఐ పెద్దల మధ్య ధోనీ గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. “దక్షిణాఫ్రికాతో సిరీస్‌ కోసం ధోనీ పేరు ప్రస్తావనకి రాలేదు. ఐపీఎల్ 2020 సీజన్‌లో ధోనీ రాణించగలిగితేనే.. మళ్లీ ధోనీ రీఎంట్రీ ఇవ్వగలడు. ఎందుకంటే.. అతనితో పాటు చాలా మంది క్రికెటర్లు జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ధోనీ కంటే ఎవరైనా మెరుగ్గా ఐపీఎల్‌లో ఆడితే..? అప్పుడు వారినే పరిగణలోకి తీసుకోనున్నారు” అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -