ధోనీ వల్లఏ నాకు ఛాన్స్ రాలేదు : పార్థీవ్ పటేల్

847
Parthiv Patel says Disappointed
Parthiv Patel says Disappointed

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వల్ల అప్పట్లో ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ కోసం ఎవరూ పోటీపడలేకపోయామని వెటరన్ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ అన్నారు. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్ తో ఇన్‍స్టాగ్రామ్ లైవ్ సెషన్ తో తాజాగా మాట్లాడిన పార్థీన్ పటేల్.. 2007-08‌లో ఆస్ట్రేలియా పర్యటనకి తాను ఎంపికకాకపోవడం చాలా బాధ కలిగించిందని అన్నాడు. “సరైనా టైంలో.. సరన ప్లేస్ లో ఉండాలని నేను అనుకుంటా.

2007-08లో ఆస్ట్రేలియా పర్యటన కోసం నేను కనీసం సెకండ్ వికెట్ కీపర్‌గా అయినా ఎంపికవుతానని అనిపించింది. ఎందుకంటే నేను అప్పటికి మంచి ఫామ్ లో ఉన్నాను. కానీ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ గా ధోనీ ఉండటం వల్ల నాకు ఛాన్స్ రాలేదు. దాంతో చాలా బాధ అనిపించింది. అప్పట్లో చీఫ్ సెలక్టర్ గా దిలీప్ వెంగ్‍సర్కార్ ఉండేవారు. టీమ్ ప్రకటనకి ముందు అతను నాకు ఫోన్ చేసి.. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. ఇలానే నీ ప్రదర్శనని కొనసాగించు అని చెప్పి.. ఆఖర్లో నిన్ను ఆస్ట్రేలియా సిరీస్‌కి ఎంపిక చేయడం లేదని చెప్పాడు” అని పార్థీవ్ పటేల్ వెల్లడించాడు.

టీ20 కెప్టెన్‌గా అప్పటికే మహేంద్రసింగ్ ధోనీ టీ20 వరల్డ్‌కప్ గెలిచి ఉండటంతో.. అతడిని పక్కన పెట్టే పరిస్థితులు లేవు. అలానే ఫిట్‌నెస్‌లోనూ ఆ సమయంలో జట్టులో ఉన్న క్రికెటర్ల కంటే ధోనీ బెస్ట్‌గా కనిపించాడు. దీంతో.. ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ అవసరం లేదని సెలక్టర్లు భావించారు. ఒకవేళ అవసరం అవుతే రాహుల్ ద్రావిడ్ తో సర్దుకోవచ్చని సెలక్షన్ కమిటీ అలోచించినట్లు తెలుస్తోంది.

Loading...