Saturday, April 27, 2024
- Advertisement -

బూమ్రా అంటే ఇష్ట‌మంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్

- Advertisement -

భారత్‌ లో క్రికెట్‌, సినిమాలది విడదీయలేని బంధం. క్రికెటర్లు, ఫిలిం స్టార్స్‌ మధ్య ప్రేమాయణాలు మనకు చాలా కామన్‌. అయితే లవ్‌ కాకపోయినా ఓ దక్షిణాది భామ యువ క్రికెటర్‌ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

దక్షిణాది ముద్దుగుమ్మ, హీరోయిన్ రాశిఖన్నా.. భారత బౌలర్ బూమ్రా అంటే చాలా ఇష్టమంటోంది. భారత క్రికెట్ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడినా చూస్తానని తెలిపింది. ఏ ఒక్క మ్యాచ్ కూడా మిస్ కానని.. అయితే ఇందుకు కారణం బూమ్రా మాత్రమేనని చెప్పింది. బూమ్రా అంటే తనకు చాలా ఇష్టమని.. బూమ్రాకి పెద్ద ఫ్యాన్‌ని అని తెలిపింది.

బూమ్రా అంటేనే పడిచస్తోన్న రాశిఖన్నా వ్యవహారం చూస్తుంటే ఆమె బూమ్రా ప్రేమలో పడిపోయిందా అంటూ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటీమణులు విరాట్ కోహ్లీ, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లను ప్రేమించి వివాహమాడారు. ఇదే తరహాలో బూమ్రాను కూడా రాశిఖన్నా ప్రేమించి వివాహం చేసుకోనుందా అంటూ ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అ అమ్మ‌డు భ‌విష్య‌త్తులో బూమ్రాని వివాహం చేసుకున్నా ఆశ్చ‌ర్య పోవాల్సి అవ‌స‌రంలేద‌ని సినీ పండితులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -