Saturday, April 27, 2024
- Advertisement -

ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్ ధోని వ‌ల్లే ఓడిపోయిందా..?

- Advertisement -

మ‌హేంద్ర సింగ్ ధోని ..ఇండియ‌న్ క్రికెట్‌లోనే కాదు , ప్ర‌పంచ క్రికెట్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌రుచుకున్నాడు. టీమిండియా కెప్టెన్‌గా జ‌ట్టు ఎన్నో విజ‌యాల‌ను అందించాడు ధోని. ఇండియాకు రెండు ప్ర‌పంచ‌క‌ప్‌ల‌ను కూడా గెలిపించి చూపించాడు. ఇక ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో కూడా చేర‌గ‌ని ముద్ర వేశాడు ధోని. తాను సార‌థ్యం వ‌హిస్తున్న చైన్నై సూప‌ర్ కింగ్స్‌కు మూడు సార్లు క‌ప్‌ను అందించాడు ధోని.

తాజా సీజ‌న్‌లో కూడా చైన్నై సూప‌ర్ కింగ్స్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది. అయితే గ‌త రాత్రి జ‌రిగిన మ్యాచ్‌లో బెంగుళూరు చేతిలో ఒక్క ప‌రుగు తేడాతో చైన్నై జ‌ట్టు ఓట‌మి పాలైంది. మొద‌టి బ్యాటింగ్ చేసిన బెంగుళూరు జ‌ట్టు 161 ప‌రుగులు చేసింది. అనంత‌రం 162 ప‌రుగుల‌తో బ‌రిలోకి దిగిన చైన్నై జ‌ట్టు 1 ప‌రుగు తేడాతో ఓటమిని చ‌విచూసింది. అయితే మ్యాచ్ చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌గా జ‌రిగింది. చేజింగ్‌లో ఆరంభంలోనే చేత్తులెత్తిసిన చైన్నై జ‌ట్టును ముందుండి న‌డిపించాడు ధోని. మ్యాచ్ చివ‌రి వ‌ర‌కు తీసుకువ‌చ్చిన ధోని అఖ‌రి బంతికి రెండు ప‌రుగులు చేయ‌లేక త‌న జ‌ట్టు ఓట‌మికి కార‌కుడైయ్యాడు. 19 ఓవ‌ర్ మొద‌టి మూడు బంతుల‌కు సింగిల్ తీసే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికి , తానే స్ట్రైకింగ్ చేయ‌ల‌నే ఉద్దేశంతో సింగ్‌ల్‌ను తీయ‌లేదు ధోని.

ఆ మూడు సింగిల్స్ తీసి ఉంటే మ్యాచ్ చైన్నై జ‌ట్టు గెలిచేద‌ని స్పోర్ట్స్ ఎన‌లిస్ట్‌లు చెబుతున్న మాట‌. అయితే ధోని మ‌రోలా ఆలోచించి ఉంట‌డని మ‌రో కొంద‌రు చెబుతున్నారు. తానే ఎక్కువుగా స్ట్రైకింగ్‌లో ఉంటే ప‌రుగులు ఈజీగా సాధించ‌వ‌చ్చ‌నే ఆలోచ‌న‌లో ధోని ఉన్నాడ‌ని, అందుకే సింగిల్స్‌కు అంత‌గా ప్రాముఖ్య‌త ఇవ్వ‌లేద‌ని ధోని అభిమానుల వాద‌న‌. ఏది ఏమైన‌ప్ప‌టికి మ్యాచ్‌ను ముగించ‌డంలో ధోని విఫ‌లం అయ్యాడ‌ని అక్ష‌ర స‌త్యం. ధోనిలాంటి స్టార్ బ్యాట్స్‌మెన్ క్రీజులో ఉన్న‌ప్పుడు బంతికి రెండు ప‌రుగులు చేయ‌క‌పోవ‌డం అనేది ఖ‌చ్చితంగా ధోని ఫెయిల‌రే. మ‌రి దీనిపై ధోని అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -