Friday, April 26, 2024
- Advertisement -

ధోని రికార్డును బ్రేక్ చేసిన రిషబ్ పంత్‌

- Advertisement -

ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో టీమిండియా ఓడిపోయినప్ప‌టికి అంద‌రి హృద‌యాల‌ను గెలుచుకుంది.ఓటమి ముందే ఊహించిన‌దే కాని ఇండియా పోరాడిన తీరు అంద‌రిని ఆక‌ట్టుకుంది,కేఎల్ రాహుల్ రిషబ్‌ పంత్‌ అద్భుత శతకల‌తో చేల‌రేగి గెలుపుపై ఆశ‌లు రేపారు. టీమిండియా యువకెరటం వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ అద్భుత శతకంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.పంత్‌ ఆడుతోంది టెస్ట్‌ క్రికెటా లేక టీ20నా అన్నట్లు అతని బ్యాటింగ్‌ సాగింది. 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114 పరుగులతో ఇంగ్లండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

దీంతో ఇంగ్లండ్‌ గడ్డపై అత్యధిక పరుగులు, సెంచరీ సాధించిన తొలి భారత వికెట్‌ కీపర్‌గా పంత్‌ రికార్డు నమోదు చేశాడు. గ‌తంలో ధోని చేసిన 92 ప‌రుగులే ఇంగ్లండ్ గ‌డ్డ‌పై అత్య‌ధికం. అంతేకాకుండా సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసి ఇలా తొలి టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్న నాలుగో భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు‌. గతంలో కపిల్‌ దేవ్, ఇర్ఫాన్‌ పఠాన్, హర్భజన్‌ సింగ్‌లు తమ తొలి సెంచరీని సిక్స్‌తో సాధించారు. టెస్ట్ క్రికెట్‌లో ప‌రుగుత ఖాతాను సిక్స్‌తో మొద‌లు పెట్టిన రిషబ్ పంత్‌, సిక్స‌ర్‌తో టెస్ట్‌లో తొలి సెంచ‌రీని పూర్తి చేయడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -