స్వ‌దేశానికి చేరుకున్న మొద‌టి క్రికెట‌ర్‌

268
Rohith Family returns to India after World Cup 2019
Rohith Family returns to India after World Cup 2019

ఇంగ్లాండ్‌లో జరిగిన క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో టీమిండియా సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అప్ప‌టినుంచి క్రికెట‌ర్లు అక్క‌డే ఉంటున్నారు. స్వేదేశానికి చేరుకొనేందుకు ఫ్లైట్ టికెట్లు దొర‌కక పోవ‌డంతో ఇంగ్లండ్‌లోనె ఉన్నారు. ప్లైట్ టికెట్లకోసం ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని రెండు రోజుల్లో కొంద‌రు స్వ‌దేశానికి వ‌స్తార‌ని మ‌రి కొంత మంది ఇత‌ర దేశాల‌కు టూర్ లో భాగంగా వెల్తార‌ని బీసీసీఐ ప్ర‌క‌టించింది.

తాజాగా రోహిత్ ఫ్యామిలి స్వదేశానికి చేర‌కుంది. నివారం తెల్లవారు జామున ముంబై విమానాశ్రయానికి చేరుకున్న రోహిత్‌ కారులో తన నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట భార్య రితిక, కూతురు సమైరా ఉన్నారు.ఈ ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ అద్భుత ఫామ్‌ను కొన‌సాగించారు.రోహిత్‌ శర్మ 9 మ్యాచ్‌ల్లో 648 పరుగులు చేసి టాప్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. ఐదు సెంచరీలతో రోహిత్‌ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

Loading...