Friday, April 26, 2024
- Advertisement -

స‌చిన్‌పైనె ట్రోల్సా… ఐసీసీకి దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన స‌చిన్‌..

- Advertisement -

టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు, క్రికెట్ దేవుడిగా పిలుచుకొనె స‌చిన్ అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో సచిన్ పేరిట 200కి పైగా వికెట్లు తీసుకున్న రికార్డు ఉండొచ్చు కానీ టెండూల్కర్ తన బ్యాటింగ్ ప్రతిభతోనే ఎవరెస్ట్ స్థాయికి చేరాడు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు. అన్నింటికీ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పిన ఏకైక ఆటగాడు. ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రికార్డుల వేటగాడు. అలాంటిది స‌చిన్ పైనె ఐసీసీ ట్రోల్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ముంబైలోని టెండూల్కర్-మిడిల్‌సెక్స్ గ్లోబల్ అకాడమీ క్యాంప్‌లో సచిన్, కాంబ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయని, తామిద్దరం ఎప్పుడూ ప్రత్యర్థులుగా ఆడలేదని తెలిపారు. దానికి తగ్గట్లు కాంబ్లీకి సచిన్ లెగ్ స్పిన్ బౌలింగ్ వేసిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అయితే, క్రీజు దాటి వేసిన దృష్యాన్ని పసిగట్టిన ఐసీసీ.. ‘మీ ఫ్రంట్ ఫుట్ చూసుకోండి.. అది నో బాల్’ అంటూ సచిన్‌ను ట్రోల్‌ చేసింది. అంతే కాదు సుప్రసిద్ధ అంపైర్ స్టీవ్ బక్నర్ నో బాల్ అని సూచిస్తున్న ఫోటోని జత చేసింది. అలాగే తన ట్వీట్ తో ఐసీసీ ఫన్నీ ఎమోజీ కూడా పెట్టింది.

ఐసీసీ ట్రోల్‌కు దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చారు స‌చిన్‌. హమ్మయ్య కనీసం ఈ సారి నేను బౌలింగ్ వేశా. బ్యాటింగ్ అయితే చేయలేదు. ఏదేమైనా అంపైర్ నిర్ణయమే ఫైనల్’ అని ఐసీసీకి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది.



Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -