Saturday, April 27, 2024
- Advertisement -

బజ్జీ ట్విట్ కు వ్యంగ్యంగా బదులిచ్చిన యూవీ….

- Advertisement -

భారత వెటరన్ క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్‌ ఎంత చనువుగా అందరికి తెలిసిందే. ముక్కోపి అయినా బజ్జీపై ఎవరూ సెటైర్లు వేయరు.ఐపీఎల్‌ సమయంలో భజ్జీతో అతిగా ప్రవర్తించిన ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌ చెంపదెబ్బ తిన్నారు. అయితే బజ్జీ,యూవీ మధ్య టీమిండియా బ్యాటింగ్ లో నాలుగో స్థానం చర్చకు వచ్చింది. బజ్జీ చేసిన సూచనను యూవీ వ్యతిరేకించారు.

ప్రధానంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నాల్గో స్థానం అనేది కీలక పాత్ర పోషించే అవకాశం ఉండటంతో దీనిపై గత కొంతకాలంగా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ నాల్గో స్థానంలో కచ్చితమైన ఆటగాడ్ని వెతకడంలో విఫలం కావడంతో అతనిపై వేటు పడింది.

నాల్గో స్థానంపై భారత వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఒక పేరును సూచించాడు. భారత్-ఎ జట్టు తరఫున 48 బంతుల్లో 91 పరుగులు చేసిన సంజు శాంసన్‌ని టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో నెం.4లో ఆడించాలని హర్భజన్ సూచించగా.. యువీ ఆ సూచనని వ్యతిరేకించాడు.

భారత వన్డే జట్టులో నెం.4 స్థానంలో సంజు శాంసన్‌ని ఎందుకు ఆడించకూడదు. అతని బ్యాటింగ్ టెక్నిక్ బాగుంది. దక్షిణాఫ్రికా-ఎ జట్టుపై మెరుగ్గా ఆడాడు’ అని హర్భజన్ ట్వీట్ చేశాడు. ఆట్వీట్ పై యువీ తనదైన శైలిలో బదులిచ్చాడు.మన టాపార్డర్‌ సూపర్‌ కదా బ్రో.. మనకి నాల్గో స్థానంలో బ్యాట్స్‌మన్‌ అవసరం లేదు’ అంటూ కాస్త వ్యంగ్యంగా రిప్లై ఇచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -