Sunday, April 28, 2024
- Advertisement -

యువరాజ్ సింగ్‌పై పోలీసు కేసు.. ఏం జరిగింది ?

- Advertisement -

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌కు కొత్త ప్రాబ్లమ్ ఎదురైంది. విషయంలోకి వెళ్తే.. రోహిత్ శర్మ‌తో కలిసి నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో యువరాజ్ సింగ్ కామెంట్స్ దుమారం రేపాయి. అయితే ఆ వీడియో పాతది అయినప్పటికి ఇప్పుడు వైరల్ అయింది.

టిక్‌టాక్‌లో టీమిండియా స్పిన్నర్‌ చహల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వీడియోలు పోస్ట్‌ చేస్తున్నాడని, వీళ్లకేం పనిలేదంటూ (బాంగీ మనషుల్లా యూజీకి పనిపాట లేనట్లుంది) యువీ వ్యాఖ్య చేశాడు. దాంతో నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఒక కులాన్ని ఉద్దేశిస్తూ కామెంట్‌ చేస్తావా అంటూ యువీపై విమర్శలు గుప్పించారు. యువరాజ్ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నెటిజన్లు డిమాండ్ చేశారు. అయితే హరియాణాలోని హిసార్‌ ప్రాంతంలో తాజాగా యువరాజ్ సింగ్‌పై పోలీసు కేసు పెట్టారు.

ఈ కేసులో రోహిత్ శర్మ‌ని కూడా టార్గెట్ చేశారు. యువరాజ్ వ్యాఖ్యలను రోహిత్ ఎందుకు అడ్డుకోలేదని దళిత హక్కుల సంఘం నేత రజత్ కల్సన్ ప్రశ్నించారు. యువరాజ్ అన్న మాట విన్న రోహిత్ నవ్వి ఎలా ఊరుకుంటాడన్నారు. యువరాజ్ సింగ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. యువీ మాటలకు సంబంధించిన సీడీలు, పత్రాలు పోలీసులకు అందజేశామని తెలిపారు. దీనిపై ఢిల్లీ ఎస్పీ లోకేంద్ర సింగ్ స్పందిస్తూ.. యువరాజ్ తప్పు చేసినట్లు నిర్ధారణ జరిగితే.. అతనిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -