- Advertisement -

అన్నిటికి సమాధానం చెప్తా..కేసీఆర్ బయటకి రాబోతున్నాడుగా..?

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈసారి జరగబోయే అసెంబ్లీ సమావేశాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. కరోనా కారణంగా పాలనా ఎక్కడికక్కడ స్థంభించిపోవడం, కరోనా ని అంతమొందించడానికి నిధులుబాగా ఖర్చుపెట్టడంతో పాటు ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలు ఇవన్నీ ఒక్కసారి నెత్తి మీద పడడంతో కేసీఆర్ కి గతంలో ఎప్పుడు లేని వత్తిడి తనమీద పడ్డట్లు అయ్యింది. ఇప్పటివరకు కేసీఆర్ చెప్పిందే రాష్ట్ర నేతలకు వేదం.. అయన మాట చెప్తే ప్రతిపక్షం నేతలు కూడా నోరుమెదిపేవారు కాదు.. కానీ ఇదంతా కరోనా రాకముందు.. కరోనా వచ్చాకా పూర్తి పరిస్థితి మారిపోయింది.. అదేసమయంలో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో ఆ పార్టీ కూడా పూర్తి లైనప్ లోకి వచ్చి కేంద్రంలో వుంది తమ పార్టీ నే అన్న భావన తో కేసీఆర్ పై విమర్శలతో రెచ్చిపోతుంది.

సచివాలయం కూల్చివేత, ఉస్మానియా ఆసుపత్రి అంశం, శ్రీశైలం విద్యుత్ సంఘటన ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమస్య లు వచ్చి పడుతుండడంతో అయన కు వత్తిడి మరింత ఎక్కువైంది.. ఓ వైపు కొడుకు, అల్లుడు పార్టీ ని తమ భుజాల మీద వేడుకుని నడుపుతున్న కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో పార్టీ యొక్క ప్రాధాన్యత తగ్గకుండా ఉండేలా చూసుకోవాలని ఎప్పటికప్పుడు పరిస్థితి ని గమనిస్తూ వాటికి తగ్గ వ్యూహాలు రచిస్తున్నాడట.. అయితే దానికి సమయం కోసం చూసిన కేసీఆర్ ఆ సమయం రాగానే తన పై వచ్చిన విమర్శలన్నీ పొతే విధంగా సమాధానం ఇవ్వాలని చూస్తున్నాడట.. అయితే వాటన్నిటికీ ఈనెల 7 న జరగబోయే అసెంబ్లీ సమావేశంలో సమాధానం చెప్పనున్నారట.. అందుకు తగ్గట్లే గ‌త స‌మావేశాల ముందు ఎన్న‌డూ చేయ‌ని తీవ్ర క‌స‌ర‌త్తు ప్ర‌స్తుతం కేసీఆర్ చేస్తున్నారు. ప్ర‌జాప్ర‌తినిధులను, అధికారుల‌ను చర్చించి  కొంత‌కాలంగా ప్ర‌భుత్వంపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు ఇక్క‌డితో చెక్ పెట్టేలా స‌మ‌గ్ర వివ‌రాల‌తో విధి విధానాల‌ను ముందుకు పోనున్నారట.వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు మంత్రులు సిద్ధం కావాలని సూచించారు. రెవెన్యూ శాఖ ప్రక్షాళన, అవినీతి నిర్మూలన లక్ష్యంగా కొత్తచట్టం రూపకల్పనపై సీఎం గత వారమే సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. మరోవైపు దివంగత మాజీ ప్రధానమంత్రి, పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలంటూ వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని కేసీఆర్‌ ఇదివరకే వెల్లడించారు.

ఇక అదే రోజు టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.ఈ శాసనసభ సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసు కురావాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇప్పటికే సిద్ధం చేసిన ముసాయిదా చట్టానికి తుదిరూపునిచ్చి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని ఆయన నిర్ణయించినట్టు తెలిసింది. ఇంకా తేలని  కొన్ని ప్రశ్నలకు ఈ సమావేశాల్లో సమాధాన్ని వస్తుందని భావిస్తున్నారు..  సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశం మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని చెప్పగా అధికారులు అలానే ఉన్నారని తెలుస్తుంది. శాసనసభలో పెండింగులో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపాలని, అసెంబ్లీ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -