Friday, May 3, 2024
- Advertisement -

జగన్ ఢిల్లీ టూర్ వెనుక ఇంత పెద్ద స్టాటజీ ఉందా..?

- Advertisement -

వైసీపీ పార్టీ ఏపీ లొ ప్రజల నమ్మకాన్ని ఏ విధంగా సంపాదించుకుందో అందరికి తెలిసిందే.. గతంలో రాష్ట్రంలో ఏ పార్టీ కి దక్కనంత కీర్తి, గెలుపు ఒక్కసారిగా వైసీపీ కి దక్కాయి.. సీఎం జగన్ కు ప్రజాభిమానం కూడా ఈ ఎన్నికల్లో ఎక్కువగా పెరిగింది.. దీనికి కారణం టీడీపీ పట్ల ఉన్న అసహనం అంటే పొరపాటే ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా చాలావరకు వైసీపీ కి అభిమానులు ఉన్నారు. కానీ రాష్ట్రం అభివృద్ధి దృష్ట్యా అనుభవం ఉన్న చంద్రబాబు కు మొగ్గు చూపారు తప్పా అప్పుడే వైసీపీ గెలిచి ఉండేది.. ఏదైతేనేం ప్రజలు ఒకసారి నమ్మి టీడీపీ ని మరోసారి నమ్మకుండా తప్పు చేయలేదు..వైసీపీ ని గెలిపించి మంచి పని చేశారు..

ఇక ఇటీవలే జగన్ ఢిల్లీ కి వెళ్లిన సంగతి తెలిసిందే.. అయితే అసలు జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది…? ఎన్డియేలో చేరడానికి వెళ్ళారా…? జగన్ అడిగినా అపాయింట్మెంట్ ఇవ్వని ప్రధాని మోడీ, అమిత్ షా ఆయనకు ఎందుకు ఉన్నపళంగా రావాలి అని కబురు పంపారు. కరోనా తీవ్రత నుంచి ఇంకా బయటపడక ముందే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లి కేంద్ర పెద్దల్ని ఎందుకు కలవాల్సి వచ్చింది…? నిధులు అడిగారా..? ఆర్ధిక శాఖ, జలవనరుల శాఖ అధికారులు ఎక్కడ…? ఇచ్చిన వినతీ పత్రాలు ఎక్కడ…? కాదు ఆయన ఢిల్లీ వెళ్ళడానికి మరేదో బలమైన కారణం ఉంది అని వార్తలు వచ్చాయి..

అయితే కొన్ని మీడియా సంస్థల కథనాల ఆధారంగా… జగన్ ఎన్డియేలో ఉన్నా బయట ఉన్నా మద్దతు ఇచ్చేది బిజెపికే. అందుకే వారిని కేంద్ర ప్రభుత్వంలో చేర్చుకోవాల్సిన అవసరం బిజెపికి లేదు. అందుకే ఆ విషయం పై పనిగట్టుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ… త్వరలో సుప్రీం కోర్టుకి కొత్త ప్రధాన న్యాయమూర్తిని నియమించాల్సి ఉంది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న జాబితాలో జస్టిస్ ఎన్వీ రమణ పేరు ముందు వరుసలో ఉంది. ఆయన ఆ స్థానంలోకి వెళ్తే చంద్రబాబుకి ప్లస్ అని, కేంద్రానికి, జగన్ కు మైనస్ అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. అందుకే ఇప్పుడు జగన్ ద్వారా ఆయనను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు బిజెపి పెద్దలు అని వార్త వస్తుంది. మరి జగన్ వెళ్లిన మీటింగ్ ఎంతవరకు ప్రయత్నిస్తుందో చూడాలి..

రాజు గారిని దించడం కోసం జగన్ అలా నరుక్కోస్తున్నాడా..?

గంటా శ్రీనివాసరావు గురించి జగన్ మనసులో మాట..?

చంద్రబాబు మించిన జగన్ రాజకీయ ఎత్తుగడ..?

జగన్ ఇలా ప్లాన్ చేస్తే టీడీపీ ఏపీ లో ఉండదు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -