మంచు మనోజ్ కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒక దశలో ఇక నేను సినిమాలు చేయనని కూడా ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత మళ్ళీ మనసు మార్చుకుని సినిమాలు చేస్తానని ప్రకటించారు. మంచు మనోజ్ రీ ఎంట్రీ లో మొదలు పెట్టిన మొదటి సినిమా అహం బ్రహ్మాస్మి. మూవీ పాన్ ఇండియా కేటగిరిలో నిర్మితమవుతోంది. ఎంఎం ఆర్ట్స్ పతాకంపై మంచు ఫ్యామిలీ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నది. శ్రీకాంత్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
చాలా విభిన్న కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా కొంతమేర షూటింగ్ జరుపుకుంది. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్‌కు చెందిన ఓ అగ్రనటుడు నటిస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా చిత్రయూనిట్ ఇందుకు సంబంధించి క్లారిటీ ఇచ్చేసింది.
బాలీవుడ్ అగ్ర నటుడు సునీల్ శెట్టి ఈ చిత్రం క్లైమాక్స్‌లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న మనోజ్ .. విభిన్న చిత్రాల్లో నటిస్తూ ముందుకు సాగుతున్నాడు. లాక్డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోగా ప్రస్తుతం నిబంధనలు సడలించడంతో త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే చాన్స్ ఉందని టాక్.
Also Read
సల్మాన్ ప్లేస్‌లో హృతిక్ రోషన్.. త్వరలో ఇన్షల్లా
