- Advertisement -

మాజీ మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు..

- Advertisement -

మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తనదైన శైలీలో సంచలన కామెంట్స్ చేశారు. మారింది ప్లేస్ మాత్రమే మనిషి కాదన్నారు. నెల్లూరు నుంచి నరసరావుపేట వెళ్లినా నాలో ఫైర్ అలాగే ఉంటుందని స్పష్టం చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన అనిల్..జగన్ నిజమైన అభిమానులు ఎలాంటి పరిస్థితుల్లో పార్టీని వీడరన్నారు.

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారతారని వస్తున్న వార్తలు కేవలం ప్రచారం మాత్రమేనని తేల్చి చెప్పారు. 2009 నుండి నెల్లూరు సిటీ నుంచి మూడుసార్లు పోటీచేశా. 2009లో తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యా కానీ తర్వాత రెండు సార్లు విజయం సాధించానని తెలిపారు. ఇప్పుడు నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వెళుతున్నా..అక్కడ గెలిచి తీరుతానని తెలిపారు.

నెల్లూరు సిటీలో ఖలీల్ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేస్తారన్నారు. తన వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇబ్బంది పడిన వారందరికీ క్షమాపణలు చెప్పారు అనిల్. 15 ఏళ్ల పాటు తనను ఆదరించిన నెల్లూరు ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు అనిల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -