- Advertisement -

ఓ వైపు చేరికలు..మరోవైపు రాజీనామాలు!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఓ వైపు చేరికలతో జోష్ నిండితే మరోవైపు పెద్ద ఎత్తున నేతలు రాజీనామాకు సిద్ధం అవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం చంద్రబాబు వైఖరే. జనసేనతో పొత్తుతో సీట్లు కొల్పోతున్న నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతుండగా మరోవైపు బీజేపీతో పొత్తును నిరసిస్తూ మాజీ కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ టీడీపీకి రాజీనామా చేశారు.

బీజేపీతో చంద్రబాబు చర్చలు జరపటాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్వేష శక్తులతో చేతులు కలపడం సహించరానిదని ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం తన ఆత్మను అమ్ముకోలేనంటూ లేఖలో పేర్కొన్నారు.

కిషోర్ చంద్రదేవ్ బాటలోనే మరికొంతమంది నేతలు ఉన్నట్లు సమాచారం. టీడీపీ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ అయిన వెంటనే పెద్ద ఎత్తున నేతలు మూకుమ్మడి రాజీనామాలను సిద్ధమైనట్లు సమాచారం. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీలో జరుగుతున్న పరిణామాలు చంద్రబాబుకు కొత్త తలనొప్పిని తెచ్చి పెడుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -