- Advertisement -

ఓటీటీ ట్రెండింగ్‌లో ‘భక్షక్’!

- Advertisement -

థియేటర్లతో పోటీగా ఓటీటీలో సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లకు మంచి ఆదరణ వస్తుండగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ల సంఖ్య కూడా పెరిగిపోయింది. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న భక్షక్‌ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా రాగా పులకిత్ దర్శకత్వం వహించారు.

షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ ఈ సిరీస్‌ని నిర్మించగా ఆదిత్య శ్రీవాస్తవ, సాయి థమకర్, రాజ్‌పాల్ యాదవ్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఫిబ్రవరి 9 నుండి స్ట్రీమింగ్ అవుతోండగా తొలి రోజు నుంచే మంచి వ్యూస్‌ని రాబడుతోంది.

వసతి గృహాల్లో ఉండే బాలికలపై జరుగుతున్న నేరాలు, అఘాయిత్యాలు, వేధింపుల నేపథ్యంలో తెరకకెక్కించారు. భూమి పెడ్నేకర్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించగా ఆదిత్య శ్రీవాస్తవ రౌడీగా ఆకట్టుకున్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించగా కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని భక్షక్ మరోసారి నిరూపించిందనిఏ అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -