- Advertisement -

తుపాను ముప్పు..అలర్ట్ !

- Advertisement -

ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత పదిరోజులుగా ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండగా ఈనెల 24వ తేదీ తరువాత బంగాళాఖాతంలో తుపాను ఏర్పడటానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడుతోందని, 26వ తేదీన అల్పపీడనంగా మారి.. ఆ తరువాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్ల కింద ఆశ్రయం పొందవద్దు అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున పెద్ద పెద్ద హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -