- Advertisement -

భర్త మహాశయులకు విజ్ఞప్తి..ట్రైలర్ డేట్

- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో ఈ సంక్రాంతికి అద్భుతమైన వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు.

ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మ్యాసీవ్ బజ్‌ను సృష్టించాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను 2026 జనవరి 7న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాకి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ ప్రసాద్ మురెళ్ల, జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్.భర్త మహాశయులకు విజ్ఞప్తి అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ తో సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ గా ప్రేక్షకుల్ని అలరించబోతుంది.జనవరి 13న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -