- Advertisement -

క్రైమ్ స్టోరీలకు ముంబైనే బెస్ట్!

- Advertisement -

భారతీయ సినిమాల్లో ముంబై నగరాన్ని క్రైమ్ కోణంలో చూసినంతగా మరే నగరాన్ని చూడలేదు. ఈ ఆసక్తి ఇప్పటికీ తగ్గకపోవడానికి కారణం ఏమిటో భూమి పెడ్నేకర్ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. క్రైమ్ కేసులను చేధించడంలో ముంబై పోలీస్ బెస్ట్ అని ఆమె ఎలాంటి సందేహం లేకుండా చెప్పారు. నేను ముంబైకర్‌ని. వాళ్లంటే నాకు చాలా ఇష్టం…ఈ భావోద్వేగ అనుబంధమే డాల్డల్ సిరీస్‌లో ముంబైని కేవలం ఒక విజువల్ స్పెక్టాకిల్‌గా కాకుండా, నిజంగా జీవించే నగరంలా చూపించడానికి కారణమైంది. ఈ సిరీస్‌లో ముంబై గ్లామర్‌గా గానీ, స్టైలిష్‌గా గానీ కాదు—అది రద్దీగా, అలసట కలిగించేలా, నైతిక సంక్లిష్టతలతో కనిపిస్తుంది.

ఈ తరహా కథనాలకు ముంబై సహజంగానే సరిపోతుందని నిర్మాత విక్రమ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. క్రైమ్ కథలు బలంగా పనిచేయాలంటే ఆ సెట్టింగ్‌లో అనేక పొరలు ఉండాలి. ముంబైలో ఒకేసారి ఎన్నో నిజాలు సహజీవనం చేస్తుంటాయి అని తెలిపింది.

దర్శకుడు సురేష్ త్రివేణి మాట్లాడుతూ ముంబై అంతర్గత సంఘర్షణలను మరింత బలపరుస్తుందని అన్నారు. నిజ జీవితంలో మనం చేయలేనివాటిని తెరపై చూడటం అందరికీ ఇష్టం… ముంబై ఆ ఎస్కేప్ కూడా, అదే సమయంలో ఎదురెళ్లే ప్రశ్న కూడా అవుతుంది అన్నారు. డాల్డల్లో పోలీస్ వ్యవస్థను అతిగా గొప్పగా గానీ, పూర్తిగా చెడ్డదిగా గానీ చూపించలేదు. భూమి పాత్ర ఆ వ్యవస్థలోనే ఉన్నా, దాని వల్ల మానసికంగా చీలిపోయిన స్థితిలో ఉంటుంది. ఆమె జీవితంలో నిజాయితీగా ఉన్న ఏకైక విషయం ఆమె ఉద్యోగం. మిగతా అన్ని చోట్ల ఆమె విరిగిపోయింది అని భూమి చెప్పారు.

ఆమెలా ముంబై కూడా ఒక పాత్రలా మారి, నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది, భావోద్వేగాలను అణచివేస్తుంది, నైతిక రాజీలకు దారి తీస్తుంది. ఆశను కూడా ఇస్తూ, క్షీణతను కూడా చూపించే ఈ ద్వంద్వ స్వభావమే ముంబై ప్రత్యేకత. డాల్డల్ ఈ విరుద్ధతను చక్కగా ఆవిష్కరిస్తూ, క్రైమ్ కథలను ముంబై కేవలం ఆతిథ్యం ఇవ్వడమే కాదు—అవి ఎలా ఉండాలో నిర్వచిస్తుందని మరోసారి నిరూపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -