- Advertisement -

శతాబ్ది నమో భారత్ మెట్రో..ప్రారంభించిన ప్రధాని

- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించి దేశంలోనే తొలి హై స్పీడ్ మెట్రో సేవలకు శ్రీకారం చుట్టారు. శతాబ్ది నమో భారత్ మెట్రోను ఆయన ప్రారంభించారు. ఇది దేశంలోనే తొలి నమో భారత్ RRTS (రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్) సేవగా గుర్తింపు పొందింది.

ఈ హై స్పీడ్ మెట్రో రైలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఆధునిక సదుపాయాలు, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ రైలు, ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది. ఢిల్లీ–మీరట్ కారిడార్ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

ప్రధాని మోదీ స్వయంగా హై స్పీడ్ మెట్రోలో ప్రయాణించి సేవలను పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి, వేగవంతమైన రవాణా వ్యవస్థకు కొత్త దిశ చూపుతుందని ఆయన పేర్కొన్నారు.

నమో భారత్ RRTS ప్రారంభంతో ఉత్తరప్రదేశ్‌లో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఈ మెట్రో సేవలు ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేయడంతో పాటు, రోజువారీ ప్రయాణికులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -