Thursday, April 25, 2024
- Advertisement -

చల్లా కుటుంబాన్ని పరామర్శించిన ఏపి సీఎం జగన్!

- Advertisement -

ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి ఇటీవలే కరోనా మహమ్మారికి బలైన సంగతి తెలిసిందే.  ఈనెల 1వ తేదీన కరోనాతో చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూసిన విషయం తెలిసిందే. కొత్త సంవత్సరం ఆరంభ సమయంలో జరిగిన ఘటనపై జగన్ వెంటనే స్పందించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి ఓర్వకల్లు వెళ్లిన సీఎం అక్కడ్నించి హెలికాప్టర్ లో అవుకు చేరుకున్నారు.

చల్లా రామకృష్ణారెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి, ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు. అవుకు వచ్చిన సీఎం జగన్ తొలుత దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి సతీమణి చల్లా శ్రీదేవి, కుమారుడు చల్లా భగీరథ రెడ్డి, సోదరలు చల్లా రామేశ్వర రెడ్డి, చల్లా రఘునాద్ రెడ్డి, చల్లా ప్రభాకర్ రెడ్డి, అల్లుళ్లు పోతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డి. రవీంద్రనాథ్ రెడ్డితో పాటు కూతురులు,  కోడళ్లు, మనవళ్లు, తన కుటుంబ సభ్యులు 25 మందిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

సీఎం జగన్ వెంట ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తదితరులున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -