తమిళ స్టార్ హీరో విజయ్ విడాకుల వ్యవహారంపై కొత్త చర్చ మొదలైంది. ఫిబ్రవరి చివర్లో ఆయన భార్య సంగీత విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. తన పిటిషన్‌లో విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఈ పరిణామం అభిమానులతో పాటు తమిళ సినీ పరిశ్రమను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక ఈ కేసుకు సంబంధించి రూ.250 కోట్ల వరకు సెటిల్‌మెంట్ జరిగే అవకాశముందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ మొత్తం సాంగీతా మరియు వారి ఇద్దరు పిల్లలు జాసన్ సంజయ్, దివ్వ సాషా కోసం కేటాయించబడుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మొత్తం ఎలా పంచబడనుందనే విషయంపై అధికారిక వివరాలు బయటకు రాలేదు.
కుటుంబ గౌరవం, గోప్యతను కాపాడేందుకు చర్చలు గోప్యంగా కొనసాగుతున్నాయని సమీప వర్గాలు చెబుతున్నాయి. విజయ్ తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పటిలాగే ప్రజల ముందుకు తీసుకురాకుండా నిశ్శబ్దంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. విడాకులు లేదా పిటిషన్‌లో పేర్కొన్న ఆరోపణలపై ఆయన నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
న్యాయ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలా మలుపుతిరుగుతుందో చూడాల్సి ఉంది.
