- Advertisement -

లోక్‌సభ ముందుకు అమరావతి బిల్లు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాజధాని ‘అమరావతి’కి చట్టబద్ధత కల్పించే బిల్లు రేపు లోక్‌సభ ముందుకు రానున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది.

ఇటీవల ఏపీ అసెంబ్లలో అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన అనంతరం, కేంద్ర ప్రభుత్వం దానిపై చర్యలు వేగవంతం చేసింది.

ఈ నేపథ్యంలో, కేంద్ర కేబినెట్ బిల్లుకు ఆమోదం తెలిపిన వెంటనే, లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

అలాగే నిత్యానంద్ రయ్… ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2026 సవరణ బిల్లు’ను లోక్‌సభలో ప్రతిపాదించనున్నారు. ఈ బిల్లులో భాగంగా అమరావతిని అధికారిక రాజధానిగా చట్టబద్ధంగా గుర్తించే అంశం ప్రధానంగా ఉండనుంది.

పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత అమరావతికి పూర్తి స్థాయి రాజధాని హోదా లభించే అవకాశం ఉంది. దీని ద్వారా రాజధాని నిర్మాణం, అభివృద్ధి పనులకు మరింత వేగం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -