- Advertisement -

పెళ్లైంది..నలుగురు పిల్లలను పెంచుతున్నా!

- Advertisement -

ఇటీవల త్రిష తన సినిమాల కంటే వ్యక్తిగత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా దళపవి విజయ్‌తో సంబంధం ఉందన్న ఆరోపణలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి.

తాజాగా త్రిష సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పిందన్న రూమర్లు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో వేగంగా వైరల్ అయ్యాయి. దీనికి స్పందించిన ఆమె వ్యంగ్యంగా స్పందిస్తూ ఆ ప్రచారాలకు చెక్ పెట్టింది. త్రిష ఇలా రాసింది.

నేను సినిమాలు వదిలేశానట, ఒక ధనవంతుడిని పెళ్లి చేసుకున్నానట, ఇద్దేళ్లు నిండిన నాలుగు పిల్లలను పెంచుతున్నానట! ఇంకేం జోడించాలి? లేక ఈరోజు కథలు ఇంతటితో సరిపోతాయా?.. ఈ చమత్కార స్పందనతో ఆమె సినిమాలు వదిలే ఆలోచనలో లేనట్టుగా స్పష్టమైంది. త్రిష ప్రస్తుతం పలువురు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె నటించిన కరుప్పు, విశ్వంభర వంటి సినిమాల విడుదల కోసం ఎదురుచూస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -