- Advertisement -

విజయారెడ్డి కేసులో కొత్త కోణం!

- Advertisement -

మూడు నెలల క్రితం చర్లపల్లిలో ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తన భార్య కుటుంబ సభ్యుల నుండి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి.

తన భార్యా పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్లు కాదని, ఆమె కుటుంబ సభ్యుల వేధింపుల వల్లనే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారని సురేందర్ రెడ్డి ఆరోపించారు. వాళ్లు చనిపోయిన కొద్దిరోజులకే ఆమె కుటుంబ సభ్యులు ఆస్తుల కోసం తనను వేధించారని, కాబట్టి తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు.

మా అత్త పుష్పలత, మా బామ్మర్ది చిరంజీవిలే కారణం …సొంత వాళ్లే నమ్మించి మోసం చేశారు అన్నారు. ఆస్తి కోసం మే నా కుటుంబాన్ని నాకు కాకుండా చేశారు ..భార్య పిల్లలు చనిపోయిన బాధలో నేనుంటే.. 25 రోజులకే నన్ను బెదిరించారు అన్నారు. నేను చనిపోతే.. నా ఆస్తి మొత్తం తల్లిదండ్రులకి, ట్రస్ట్ కి రాస్తా…నా భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాళ్లు కాదు అన్నారు సురేందర్ రెడ్డి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -