తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో కాలంగా చర్చల్లో ఉన్న ఒక భారీ ప్రాజెక్ట్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి చిత్రం లార్డ్ కార్తికేయ (కుమారస్వామి) నేపథ్యంలో ఒక పాన్-ఇండియా పౌరాణిక గాథగా ఉండబోతుందని సమాచారం.
ఈ సినిమాలో హీరో ఎవరనే దానిపై ఇప్పటివరకు ఎన్నో ఊహాగానాలు వచ్చినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, మే 20, 2026న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్ట్‌కు ‘షణ్ముఖుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది మే 20 వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ ఇదే నిజమైతే, తారక్ పుట్టినరోజున అభిమానులకు ఇది అతిపెద్ద కానుక అవుతుంది.
