- Advertisement -

దృశ్యం 3..ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!

- Advertisement -

మోహన్‌లాల్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ అప్‌డేట్ వచ్చేసింది. దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘దృశ్యం 3’ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

పనోరమా స్టూడియోస్ ద్వారా పెన్ స్టూడియోస్ సంస్థ, మోహన్‌లాల్ సొంత నిర్మాణ సంస్థ అయిన ఆశీర్వాద్ సినిమాస్‌లో ఏకంగా రూ. 100 కోట్ల భారీ పెట్టుబడి పెట్టింది. ఈ సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగానే ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి వచ్చినట్లు తెలుస్తోంది. ఇది సినిమా నిర్మాణ విలువలను మరియు స్థాయిని మరింత పెంచనుంది.

ఈ చిత్రం మే 21, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మోహన్‌లాల్ భార్యగా మీనా తన పాత్రను మళ్లీ పోషించబోతున్నారు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లను డీల్ చేయడంలో మాస్టర్ అయిన జీతూ జోసెఫ్ ఈ మూడవ భాగాన్ని కూడా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రం కథాంశంపై ఇంకా గోప్యత పాటిస్తున్నప్పటికీ, జార్జ్ కుట్టి మళ్లీ పోలీసుల నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడనే అంశంపైనే చర్చ నడుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -