పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తప్పనిసరిగా ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.అక్రమంగా డబ్బులు కూడ బెట్టానే పనామాపేర్స్ద్వారా లీక్ అవడంతో కోర్టు విచారన ఎదుర్కొవాల్సి వచ్చింది.కోర్టు ప్రాదమిక ఆదారాలు ఉండటంతో వెంటనే పదవికి రాజీనామ చేయాలని ఆదేశించడంతో వెంటనే రాజీనామ చేశారు.
దేశ భవిష్యత్తు ఏంటన్న విషయమై ఆసక్తి నెలకొంది. ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తూ, పీఎంఎల్-ఎన్ పార్టీకి చెందిన మరో వ్యక్తిని ప్రధానిగా నియమిస్తారా? లేక పాలనను సైన్యం తన అధీనంలోకి తీసుకుంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అధికార పీఎంఎల్-ఎన్ లో షరీఫ్ కు దీటైన నాయకుడు మరొకరు లేకపోవడం అతిపెద్ద లోటుగా నిలిచింది.
ఆయన కుమార్తె మర్యామ్ నవాజ్ ఇప్పటివరకూ పెద్దగా ప్రజా జీవితంలో, క్రియాశీల రాజకీయాల్లో లేకపోగా, సోదరుడు షహబాజ్ షరీఫ్ పంజాబ్ ప్రావిన్స్ కు మాత్రమే పరిమితమై ఉన్నారు. ఆయనకు ఒక్క ప్రావిన్షియల్ స్థానం మాత్రమే ఉండటంతో ప్రధాని పదవిని ఇప్పటికిప్పుడు స్వీకరించే వీలు లేదని తెలుస్తోంది. తొలుత తనకు అనుయాయుడు, రక్షణ మంత్రి అయిన ఖావాజా ఆసిఫ్ ను తాత్కాలిక ప్రధానిగా నియమించి, ఆపై సోదరుడిని ప్రధానిగా చేసేందుకు నవాజ్ ఎత్తులు వేయవచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
ఇప్పటివరకూ నవాజ్ షరీఫ్ మూడు సార్లు పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించగా, ఏ ఒక్కసారి కూడా పూర్తి కాలం పదవిలో లేరు. 1993లో ఆయనపై లంచాల ఆరోపణలు రాగా తొలిసారి ప్రధానిగా తొలగించబడ్డారు. ఆపై 1999లో సైన్యాధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్, నవాజ్ నుంచి అధికారాన్ని లాక్కొన్నారు. ఆపై ఇప్పుడు మూడోసారి ఆయన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోకుండానే తొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు సార్లు పాక్ ప్రధానిగా ఎన్నికయినాకూడా పూర్తి పదవికాలం కొనసాగించని దురదృష్టవంతుడు నవాజ్ షరీప్.
