క్రికెట్ జట్టు ఆటగాళ్లకు బీసీసీఐ తీపి కబురు అందించింది. ఆటగాళ్ల వార్శిక వేతనాలను భారగా పెంచింది. ప్రపంచంలో అత్యధికి వార్శిక వేతనం అందుకుంటున్న వారిలో భారత క్రికెటర్లు ఒకరు. ఇటీ వలే ఆటగాళ్ల వేతనం పెంచనున్నట్లు బీసీసీఐ ప్రకటించిన వెంటనే ఉత్తర్వులు జారీ అయ్యాయి.
గతంలో ఆటగాళ్ల వార్శిక వేతనాలను పెంచాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా 2017-18కి గాను కొత్త కాంట్రాక్టును బీసీసీఐ అమలు చేయనుంది. గ్రేడ్ ఏ, బీ, సీ… కేటగిరీల్లో బీసీసీఐ ఆటగాళ్లకు వేతనాలు ఇస్తుంది. కొత్త కాంట్రాక్టు ప్రకారం గ్రేడ్ ఏ ఆటగాళ్ల వార్షిక వేతనం రూ. 10 కోట్లు పెరిగింది. వీరికి గతంలో రూ. 2 కోట్ల వేతనం అందేది. అంటే మొత్తంగా గ్రేడ్ ఏ ఆటగాళ్లకు రూ. 12 కోట్ల వార్షిక వేతనం అందనుంది.
గ్రేడ్ బీ, సీ ఆటగాళ్లకు ఇప్పటివరకు రూ. 1 కోటి, రూ. 50 లక్షల వార్షిక వేతనం అందేది. కొత్త కాంట్రాక్టు ప్రకారం వారికి రూ. 8 కోట్లు, రూ. 4 కోట్ల వార్షిక వేతనం అందనుంది. గ్రేడ్ ఏలో విరాట్, ధోనీ, రవిచంద్రన్ అశ్విన్, అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, మురళీ విజయ్ ఉన్నారు.
గ్రేడ్ బీలో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, జస్ప్రీత్ బుమ్రా, యువరాజ్ సింగ్‌లు ఉన్నారు. ఇక గ్రేడ్ సీలో శిఖర్ ధావన్, అంబటి రాయుడు, అమిత్ మిశ్రా, మనీష్ పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, హార్దిక్ పాండ్య, కేదార్ జాదవ్, యుజ్వేంద్ర చాహల్‌లు ఉన్నారు.
