- Advertisement -

హీట‌ర్ల క‌న్నా కుండ మేలంటున్న స్టైలిష్ స్టార్‌

- Advertisement -

స‌రిహ‌ద్దులో సైన్యం నేప‌థ్యంలో వ‌స్తున్న సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. అల్లు అర్జున్‌, అనూ ఇమ్మాన్యుయేల్ జంట‌గా న‌టిస్తుండ‌గా వ‌క్కంతం వంశీ దర్శ‌క‌త్వం చేస్తున్నాడు. అయితే ఈ సినిమా గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్నీ అల్లు అర్జున్ అభిమానుల‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

ఈ సినిమా షూటింగ్‌ కశ్మీర్‌ సరిహద్దుల్లో చేశారు. జ‌మ్మూకాశ్మీర్ పూర్తిగా మంచుతో కూడిన ప్రాంతం. పైగా చ‌లికాలంలో షూటింగ్ చేయ‌డంతో అక్క‌డ మైనస్‌ 12 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఈ వాతావరణంలో షూటింగ్ చేయ‌డం సాహ‌సంతో కూడిన‌ది. అయితే ఆ చ‌లి నుంచి బ‌న్నీ ర‌క్ష‌ణ పొంది షూటింగ్‌లో విజ‌య‌వంతంగా పాల్గొన్నాడు.

చలిని తట్టుకోవడానికి అర్జున్ ఓ కుండను వెంటబెట్టుకెళ్లాడు.. ఈ కుండను ‘కాంగ్డి’ అని పిలుస్తారు. ఈ విషయాన్నిఇన్‌స్టాగ్రామ్‌తో ఆ ఫొటోను పోస్ట్‌ చేశారు. ‘ఈ కుండను ‘కాంగ్డి’ అంటారు. కశ్మీర్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడి చల్లటి వాతావరణాన్ని తట్టుకోవడం ఈ కుండతోనే సాధ్యమైంది. ఈ కుండ ముందు ఏ ఆధునిక హీటర్లు పనికిరావు’ అని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -