సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలయిన వైసీపీ, జనసేనలు ప్రజల్లో ఉన్నారు. ఇక అధికార పార్టీ కూడా ప్రభుత్వ కార్యక్రమాలతో ఓటర్లను ఆకట్టుకొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 2019 ఎన్నికల్లో అధికారమే పరమావధిగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి.
ఇక పార్టీలు అభ్యర్తుల వేటలో పడ్డాయి. ఇప్పటికే చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల పనితీరుపై సర్వేనివేదికలను తెప్పించుకున్నారు. ఇక జనసే కూడా ఒంటరిగా అన్ని సీట్లల్లో పోటీచేస్తామని ప్రకటించింది. ఇక వైసీపీ ఒకడుగు ముందుకేసి నియోజకవర్గాల్లో వివిధ పార్టీల బలాలు, గెలుపు గుర్రాలు ఎవరు? ఏ నాయకుడికి, ఏ సామాజికవర్గానికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తదితర వివరాలలో కూడిన సర్వేను వైసీపీ పూర్తి చేసింది.
వైసీపీ ఎన్నికల వ్యూహకర్త పీకే టీమ్ ఈ సర్వేను పూర్తి చేసి జగన్‌కు అందించినట్లు తెలుస్తోంది.పార్టీ నేతలకు కూడా ఏ మాత్రం సమాచారం లేకుండానే ఈ సర్వేను పీకే టీమ్ పూర్తి చేసింది. వివిధ వర్గాల ప్రజలతో వారు మమేకమై అభిప్రాయాలను సేకరించారు. ఈ సర్వే నివేదిక ఆధారంగానే పలువురు నేతలకు జగన్ ఇప్పటికే పరోక్ష సంకేతాలను పంపినట్టు సమాచారం.
సర్వే నివేదిక ఆధారంగా పాదయాత్ర జరుగుతున్న ప్రాంతాల్లోనే జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించాలని జగన్ భావించారు. అయితే, వివిధ కారణాలతో ఆ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. పాదయాత్ర పూర్తయిన తర్వాత నేతలతో జగన్ వరుస భేటీలు ఉండనున్నట్టు సమాచారం.
మరోవైపు పీకే టీమ్ సర్వే జరిపిన విషయం వాస్తవమేనని, అయితే సర్వేలో ఏయే నాయకుడినే ఎలాంటి రిపోర్ట్ ఉందో మాత్రం తనకు తెలియదని పార్టీకి చెందని ఓ నేత తెలిపారు. ప్రస్తుతం వైసీపీ నేతల్లో ఈ సర్వే గుబులు రేపుతోంది. రానున్న ఎన్నికల్లో తమకు టికెట్ దక్కుతుందో, దక్కదో అని పలువురు నేతలు టెన్షన్ కు గురవుతున్నారట.
