మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించడంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి చట్ట నిబంధనలే అత్యున్నతమని చెప్పారు. లైంగిక దాడులకు పాల్పడాలనే మృగాళ్లలో భయం కలిగించడం ముఖ్యమని అన్నారు.
లైంగిక దాడుల ఆలోచన లేని సమాజం ఆవిష్కృతం కావాలన్నారు. లైంగిక దాడి కేసుల విచారణకు మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో త్వరితగతిన విచారణ చేపట్టి రోజుల వ్యవధిలోనే నిందితులకు మరణ దండన విధిస్తున్నారని, ఈ కేసులపై విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా ఈ తరహా నేరాలకు వేరొకరు పాల్పడకుండా నిరోధించవచ్చన్నారు
2022 నాటికి సొంత రాకెట్, టెక్నాలజీతో భారతీయులను అంతరిక్షంలోకి పంపిస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఇస్రో తీవ్రంగా కృషి చేస్తోందని వెల్లడించారు. 2022 నాటికి దేశం స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు పూర్తవుతాయనీ, అప్పటికల్లా భారతీయ యువతి లేదా యువకుడిని అంతరిక్షంలోకి పంపుతామని స్పష్టం చేశారు.
ప్రధాని ప్రకటనను ఇస్రో చైర్మన్ కె.శివన్ స్వాగతించారు. తమకు చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ, 2022 నాటికి లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ వ్యోమగాములను జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపే అవకాశముందని వ్యాఖ్యానించారు. రాబోయే 40 నెలల్లో ఈ ప్రాజెక్టు కోసం రూ.9,000 కోట్లు వెచ్చించనున్నట్లు శివన్ పేర్కొన్నారు.
Tripura, Meghalaya and many parts of Arunachal Pradesh are seeing historic peace. From 126, Left Wing Extremism is restricted to 90 districts. We are working to ensure peace across the nation: PM Modi pic.twitter.com/wSEkwgp4yu
— ANI (@ANI) August 15, 2018
