- Advertisement -

క్రిష్ డైరెక్షన్ లో పవన్ మూవీ.. పారితోషకం ఎంతంటే ?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కొన్నేళ్ల పాటు ఆయనకు హిట్ సినిమా లేకపోయినప్పటికి అభిమానులు మరింత పెరిగారు కానీ తగ్గాలేదు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అవుతే కలెక్షన్ల సునామీ సృష్టించాల్సిందే. వారం పాటు టికెట్లు దొరకడం కూడా కష్టమే. అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి పవన్ వెళ్లిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ స్థాపించినప్పటికి ఎన్నికల బరిలో మాత్రం గత ఏడాది పాల్గొన్నాడు.

అయితే రాజకీయ పరంగా పవన్ కు భారీ దెబ్బ పడింది. జనసేనకు కేవలం ఒక్క సీటు మాత్రమే రావడంతో అతని అభిమానులు నిరాశ చెందరు. ఇక పవన్ పోటీ చేసిన రెండు చోట్లో ఓడిపోవడంతో అందరు పవన్ రాజకీయాల్లో నుంచి తప్పుకుంటారు అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నాడు. అయితే గత కొంత కాలంగా పవన్ మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారని రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ కథనాయుకుడు తర్వాత మరో సినిమా చేయలేదు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ కు స్టోరీ వినిపించాడని తెలుస్తోంది. స్టోరీ కూడా పవన్ కళ్యాణ్ కు బాగా నచ్చిందని సమాచారం. ఇక ఈ సినిమాని ఖుషీ నిర్మాత ఎం రత్నం నిర్మిస్తున్నారని అంటున్నారు. ఇప్పటి స్టార్ హిరోలు రెమ్యునరేషన్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటున్నారు.

డైరెక్ట్ రెమ్యునరేషన్ కాకుండా రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో కొంచెం వాటా కూడా అడుగుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అలాంటివి ఏం లేకుండా డైరెక్ట్ గా 50 కోట్ల పారితోషకం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు ఈ సినిమా 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -