సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపులపై గత కొంతకాలంగా ఫైట్ చేస్తుంది సింగర్ చిన్మయి శ్రీపాద. లైంగిక వేధింపుల గురించి మాట్లాడినందుకు తనకు అవమానాలు, అవహేళనలు ఎదురయ్యారని వాపోతుంది చిన్మయి. తనను డబ్బింగ్ యూనియన్ నుంచి తప్పించారని ,పాటలు పాడే అవకాశం రాకుండా చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో గేయ రచయిత వైరముత్తు మాత్రం గొప్ప వ్యక్తిగా చలామణి అవుతూ సత్కరాలు, సన్మానాలు పొందుతున్నారని మండిపడింది. ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన లిటరరీ ఫెస్టివల్‌కు అతిథిగా వచ్చిన ఆమె మీడియతో పలు విషయాలను పంచుకుంది.
ఇండియాలో మహిళలకు ఏం జరిగిన బయటకు చెప్పకూడదని, ఒకవేళ చెబితే బాధితురాలినే నిందితులుగా చూస్తుందని చెప్పుకొచ్చింది చిన్మయి. తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పినందుకు నన్ను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. నాతో పడుకోవడానికి ఎంత తీసుకుంటావు’ అని పిచ్చిపిచ్చి సందేశాలతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మరి కొందరు అయితే నన్ను వ్యాభిచారిగా చిత్రికరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది చిన్మయి. తన భర్త రాహుల్ వల్లే తాను ఇంత పోరాటం చేయగలుగుతున్నానని తెలిపింది.
- Advertisement -
రాత్రికి ఎంతతీసుకుంటావ్ అని అడుగుతున్నారట
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
