Sunday, May 5, 2024
- Advertisement -

నిర్మాణ రంగంలోకి ద‌గ్గుబాటి రానా

- Advertisement -

ద‌గ్గుబాటి వంశం రామానాయుడితో ఓ వెలుగు వెలిగింది. నిర్మాణ రంగంలో ఓ ధృవ‌తార‌గా నిలిచారు. భార‌త‌దేశంలోని 13 భాష‌ల్లో సినిమాలు నిర్మించి అద్భుత‌మైన విజ‌యాలు అందుకున్నారు. అందుకే అత‌డిని మూవీ మొఘ‌ల్‌గా కీర్తి గ‌డించారు. ఆయ‌న‌కెన్నో అవార్డులు, రివార్డులు, పుర‌స్కారాలు మోక‌రిల్లాయి. ఆయ‌న 1964లో ప్రారంభించిన సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ విజ‌యాల‌కు వాకిలిగా నిలుస్తోంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టిదాక ఎన్నో సినిమాలు విజ‌య‌వంత‌మ‌య్యాయి. అత‌డితో ప్రారంభ‌మైన నిర్మాణ రంగం త‌ర్వాత త‌న కుమారుల‌కు మంచి భ‌విష్య‌త్ ఇచ్చారు. ఓ కుమారుడు న‌టుడిగా కొన‌సాగుతుండ‌గా.. మ‌రో కుమారుడు సురేశ్ బాబు తండ్రి వార‌స‌త్వం అంది పుచ్చుకున్నాడు. నిర్మాణ రంగంలో దూసుకెళ్తున్నాడు. నిర్మాణ రంగంలో తాత‌, కొడుకు, మ‌న‌వ‌డుగా ద‌గ్గుబాటి వంశం వెళ్తోంది.

సురేశ్‌బాబు ఆధ్వ‌ర్యంలో..
ప్ర‌స్తుతం రామానాయుడు ప్రారంభించిన దారిని వేసుకుంటూ పోతున్నారు సురేశ్‌బాబు. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో కొత్త కొత్త సినిమాలు తీసుకొస్తూ మంచి విజ‌యాలు అందుకుంటున్నారు. కొత్త వారికి కూడా అవ‌కాశాలు ఇస్తూ వెళ్తున్నారు. హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, నాన‌క్‌రామ్‌గూడ‌లో ఒక్కోటి, విశాఖ‌ప‌ట్ట‌ణంలో మ‌రోటి మొత్తం మూడు స్టూడియోస్ నిర్మించుకొని కొన‌సాగుతున్నారు. ఇత‌డి కుమారుడు రానా (రామ‌నాయుడు) న‌టుడిగా మంచి సినిమాలు చేస్తున్నాడు. తండ్రి వార‌స‌త్వంతో వ‌చ్చి మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు రానా కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్ట‌బోతున్నాడంట‌.

మ‌న‌వ‌డు (మూడో త‌రం)..
అక్కినేని నాగార్జున రెండో వారసుడు అఖిల్‌, రానా ఇద్ద‌రు మంచి మిత్రులే కాక వ‌రుస‌కు బంధువులు కూడా అవుతారు. వీరిద్ద‌రూ క‌లిసి ఓ సినిమాకు క‌లిసి ప‌ని చేయ‌నున్నార‌ట‌. ఆది పినిశెట్టి సోద‌రుడు స‌త్య పినిశెట్టి ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ న‌టించ‌నున్న సినిమాకు రానా నిర్మిస్తాడంట‌. రానా దగ్గుబాటికి ఇంత‌కుముందే క్వాన్ అనే ఓ సంస్థ ఉంది. ఈ సంస్థ‌తో అఖిల్‌ సినిమాను నిర్మించ‌నున్నాడు. మేన‌ల్లుళ్ల సినిమాలు ఎలాగో సురేశ్‌బాబు నిర్మించ‌లేదు. కావున ఆ బాధ్య‌త రానా తీసుకున్నాడు. ఇప్పుడు రానా నిర్మాణ రంగంలోకి ప్ర‌వేశిస్తే మూడో త‌రం కూడా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో దూసుకెళ్ల‌వ‌చ్చు. త‌న సోద‌రుడు అభిరామ్ ద‌గ్గుబాటిని కూడా రానా బ్యాన‌ర్‌లో సినిమా వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -