Friday, March 29, 2024
- Advertisement -

మా ఎలక్షన్ పై రవి బాబు కీలక వ్యాఖ్యలు..!

- Advertisement -

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రసవత్తరంగా మారుతుంది. అధ్యక్ష పదవి కోసం ప్రధాన పోటీదారులుగా ఉన్న మంచు విష్ణు – ప్రకాశ్‌రాజ్‌ల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. చివరకు మా అసోసియేషన్‌ను కూడా నడపడం మనకు చేతకాదా..? ఎవరో వచ్చి మనకు నేర్పించాలా..? నటుడు, దర్శకుడు రవిబాబు వ్యాఖ్యలు చేశారు.

రవిబాబు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇందులో లోకల్‌, నాన్‌లోకల్‌ ఇష్యూను లేవనెత్తడం తన ఉద్దేశం కాదన్న రవిబాబు.. సభ్యులు ఒకసారి ఆలోచించాలని కోరారు. అంతే కాదు మన క్యారెక్టర్‌ ఆర్టిస్టులకు వేషాలివ్వకుండా.. ఇతర భాషల నుంచి నటులను తెచ్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అలాగే.. హైదరాబాద్‌లో 150 నుంచి 200 మంది కెమెరామెన్లు ఖాళీగా ఉంటున్నారని.. వారిని కాదని ఇతర ప్రాంతాల నుంచి కెమెరామెన్లను తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని పక్కనపెడితే.. నటీనటుల సంక్షేమం కోసం.. వాళ్ల సమస్యల పరిష్కారం కోసం మనం ఏర్పాటు చేసుకున్న చిన్న సంస్థ ‘మా’. మన కోసం మనం పెట్టుకున్నాం. అలాంటి ఒక చిన్న సంస్థలో పనిచేయడానికి కూడా మనలో ఒకడు పనికిరాడా? దీనికి కూడా మనం బయట నుంచే మనుషులను తెచ్చుకోవాలా? ఇది మన సంస్థ.. మనం నడుపుకోలేమా? మనకి చేతకాదా? ఒక్కసారి ఆలోచించండి’ అంటూ రవిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

Watch: బయటినుంచి ఎవడో వచ్చి మనకు నేర్పించాల.. మనం నడుపుకోలే “మా “..?

Also Read

సమంత మొదటి లవ్ బ్రేకప్ స్టోరీ..!

టాలీవుడ్ లో విలన్స్ గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోలు..!

టాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కడ.. ఏం చదువుకున్నారో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -