ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత..!

- Advertisement -

ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ నిన్న రాత్రి కన్నుమూశారు. నిన్న ఉదయం 11 గంటలకు గుండెపోటుతో వివేక్ చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు. అయితే ఈరోజు ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అయన మృతిచెందారు. వివేక్ హతన్మరణంతో తమిళ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

కాగా కమెడియన్ వివేక్ దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. అయన కామెడీ టైమింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న వివేక్. సౌత్ ఇండియాలో అయన మంచి కమెడియన్ గా గుర్తింపు సొంతం చేసుకున్నారు. దర్శకుడు కె. బాలచందర్‌ పరిచయం చేసిన నటుల్లో వివేక్ ఒకరు.

- Advertisement -

మనదిల్‌ ఉరుది వేండం అనే సినిమాతో వివేక్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. దాదాపు స్టార్ హీరోలు రజనీకాంత్‌, కమల్‌హాసన్, విజయ్‌, అజిత్‌ ఇలా అందరితో కలిసి అయన నటించాడు. శివాజీ, అపరిచితుడు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు వివేక్.

పవన్ కళ్యాన్ కి కరోనా పాజిటీవ్…

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -