Saturday, May 11, 2024
- Advertisement -

కొంచెం క‌ష్టంగానే ‘హ‌లో’

- Advertisement -

అంద‌రు ఎంత‌గానో ఎదురు చూస్తున్న అఖిల్ ‘హ‌లో’ మూవీ రివ్యూ వ‌చ్చేసింది.

కథ : అవినాష్ (అఖిల్) తన చిన్నప్పటి నుండి ప్రేమించిన అమ్మాయి కోసం రోజు పార్క్ వద్ద ఎదురుచూస్తూ ఉంటాడు. ఆటైం లో అమ్మాయి ఆచూకి చెప్పగలిగే ఫోన్ కాల్ వస్తుంది. మాట్లాడేప్పుడే ఆ ఫోన్ ని ఎవరో దొంగిలిస్తారు. ఆ ఫోన్ చేసిన నెంబర్ కోసం అవినాష్, దొంగ ని వెరీ బిగ్ చేజ్ చేసి పట్టుకుంటాడు. కాని ఆ ఫోన్అ ప్పటికే సెల్ ఫోన్ దొంగిలించే ముఠా చేతికి చేరుతుంది. హీరో నిరాశతో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. చిన్నప్పుడు అవినాష్ శీను. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పాటలు పాడుకుంటూ జనాలు ఇచ్చే మనీతో జీవితం సాగిస్తుంటాడు. బేబీ హీరొయిన్‌ని అక్కడపార్కులో కలుస్తాడు ఒకరంటే ఒకరికిఎంతోఇష్టం. ఇంతలో బేబీ హీరొయిన్‌ నాన్న కి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోతారు . వెళ్ళే లోపు బేబీ హీరొయిన్‌ శీనుని కలవలేక వంద రూపాయల నోటు మీద తన ఫోన్ నెంబర్ వేసి బుల్లి హీరో కిఇచ్చి వెళ్ళిపోతుంది. కాని శీను దగ్గరనుండి దాన్ని ఎవరో లాగేసుకుంటారు. వాడ్ని పట్టుకునే ప్రయత్నం లో శీను కారు కింద పడతాడు. కారు నడిపేది సరోజని ( రమ్యకృష్ణ). సరోజని భర్త ప్రకాష్(జగపతి బాబు).

ప్రకాష్,సరోజనిల‌కు శీను నచ్చి త‌మవెంట తీసుకువెళ్ల‌తారు.అప్పటి నుండి శీను ప్రియ(హీరొయిన్‌) కోసం రోజు పార్క్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు. ప్రియ(హీరొయిన్‌) ఏమో ఢిల్లీ లో కుర్చుని 14 సంవత్సారాల నుండి, శీను ఫోన్ కోసం ఎదురు చూస్తూ వుంటుంది కాని ఎప్పుడూ హైదరాబాద్ వచ్చి శీను కోసం అస్సలు వెతకదు. అలా ఒక ఫ్లాష్ బాక్ ముగుస్తుంది.ఫ్లాష్ బ్యాక్ నుండి హీరో కళ్ళు తెరిచే సరికి దొంగలు వాళ్ళు దొంగిలించిన ఫోన్స్ ని బీహార్ పంపుతారు.

హీరో బిహార్ వెళ్తున్న ట్రక్ ని ఇంకో పెద్ద చేజ్‌చేసి హైవే మీద పెద్ద ఫైట్ చేసి ఫోన్ సంపాదిస్తాడు. ఫోన్ సంపాదించాక ఆఫోన్ పని చెయ్యదు. ఈ లోపు హీరోయిన్ హైదరాబాద్ వస్తుంది. శీనుతో ప్రియ(హీరోయిన్‌)కి ప‌రిచియ‌మ‌వుతుంది.అవినాష్ కూడా ప్రియ కి ఒకటి రెండు సార్లు మంచి పనులు చేస్తూ కనపడతాడు . సో అవినాష్, ప్రియ(హీరోయిన్‌) కనెక్ట్అవుతారు.సో మిగిలిన కథ అవినాష్, జున్ను(హీరోయిన్‌)ని గుర్తు పట్టడం, ప్రియ(హీరోయిన్‌), శీను నిగుర్తు పట్టడం. ఇంతటి తో హలో కథ సమాప్తం.

నటన : ఖిల్ నటన చక్కగా ప్రోమిసింగ్ గా ఉంది కాని ఇంకా పేస్ లో ఎన్నో ఎమోషన్స్ పలకాలి. నాగార్జున గారు చెప్పినట్లు నాగార్జున ఫస్ట్ 5మూవీస్ కంటేఎంతో ఎక్కువ గా బెటర్ గా ఈజీ గా చేసాడు. ఫైట్ సీన్స్ లో, డాన్స్ లో తన కష్టం కనిపిస్తుంది. ఒకసాంగ్ కూడా పాడాడు. నాగార్జున గొంతు గుర్తుకు తెప్పిస్తాడు. నాగార్జున వాయిస్ఓవర్ చాల బాగాఉంది, మనం లో కూడావిన్నాం. . కాని ఇందులో అఖిల్ వాయిస్ఓవర్ అంత క్లియర్ గాలేదు.కళ్యాణి ప్రియదర్శన్ చూడటానికి బాగున్నా, ఇంకా డెప్త్ వున్న, డైలాగ్స్ వున్న సీన్స్ ఎక్కువ లేకపోవడం వల్ల తన ఫ్యూచర్ ఎలా వుంటుందో ఈ ఒక్క సినిమా తో చెప్పడం కష్టం. ఇక రమ్యకృష్ణ, జగపతి బాబు పాత్ర లు చక్కగా వున్నాయి. కాని ఒకటి రెండు సీన్స్ కొంచెం ఓవర్ బోర్డ్ వెళ్ళినట్లు అనిపిస్తాయి

సాంకేతిక విభాగం:ఈ సినిమా కి సినిమాటోగ్రఫి P.S. వినోద్ చాల పెద్ద అసెట్. అలాగే సాంగ్స్ “మనం” సాంగ్స్ నిగుర్తు తెచ్చేలా వున్నా, స్టిల్ “మనం” మాజిక్ ని అనూప్ క్రియేట్ చెయ్యలేక పోయాడు. ఎడిటర్ ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఓకే. ఈ సినిమా బిగ్గెస్ట్ మైనస్ కథనం. రెండో ఫ్లాష్ బ్యాక్ తో కథ మొదలు చేసి, చైల్డ్ హుడ్ స్క్రీన్ టైం 35 మినిట్స్ నుండి 15 మినిట్స్ కి తగ్గించి వుంటే ఎంతో బెటర్ గా వుండేది. ఫస్ట్ హాఫ్ లో అప్పుడు ఇంత పెద్ద చేజ్ లు లాజిక్ లేకుండా పెట్టార‌నే అనే ఫీలింగ్ అంత వుండేది కాదు. దీనిలో డైరెక్టర్ ప్రమేయం ఎంత, ఎడిటర్ ప్రమేయం ఎంత అనేది వాళ్ళకే తెలియాలి నాగార్జున అక్కినేని ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.కొడుకు సినిమా కావడంతో బాగా రిచ్‌గా తీశారు.

బోట‌మ్ లైన్: ఒక్క మాటలో చెప్పాలి అంటే: తప్పక చూడాల్సిన సినిమా అయితే కాదు, తప్పకపోతే చూడాల్సిన సినిమానే.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -