క్రేజీ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ

- Advertisement -

మల్టీ స్టారర్స్‌తో సినిమాలకు సక్సెస్ రేట్ ఎప్పుడూ ఎక్కువే. తాజాగా దర్శకుడు రాజమౌళీ ఆర్ఆర్ఆర్ చిత్రం ఓ రేంజ్‌లో సక్సెస్ కావడంతో ఈ ట్రెండ్‌ను మరింత అందిపుచ్చుకునేందుకు చాలా మంది డైరెక్టర్లు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా క్రేజీ హీరోల కాంబినేషన్లతో సినిమాలు తీసేందుకు సిద్ధమవుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌తో ప్రచారం జరుగుతోంది. అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్‌తో ముందుకు రాబోతున్నారు దర్శకుడు కొరటాల శివ.

పుష్పతో జాతీయ స్థాయిలో సెన్సేన్షన్‌గా మారిన అల్లు అర్జున్, రెండు నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న తమిళ స్టార్ హీరో ధనుష్ కలయికతో ఈ మూవీ రాబోతోందని సమాచారం. కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన ‘ఆచార్య’ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తర్వాత యంగ్ టైగర్ యన్టీఆర్‌తో ఓ సినిమా తీయబోతున్నారు.

జనతా గ్యారేజ్ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకా బన్నీ, ధనుష్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌ మూవీ పట్టాలెక్కబోతోంది. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా నిర్మించబోతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం ధనుష్ తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -