- Advertisement -

‘మ‌హ‌న‌టి’కి అల్లువారి పార్టీ

- Advertisement -

అల‌నాటి తార సావిత్రి జీవిత క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో సావిత్రి పాత్ర‌ను హీరోయిన్ కీర్తి సురేష్ పోషించింది. మే 9న రీలిజ్ అయిన ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.సినిమా క‌లెక్ష‌న్లు కూడా అధేవిధాంగా ఉన్నాయి.అమెరికాలో ఈ సినిమా 1 మిలియ‌న్ క‌లెక్ట్ చేసింది. ఓవ‌ర్ఆల్‌గా తెలుగు సినిమాల‌లో మ‌హ‌న‌టి సినిమా 6 స్థానంలో నిల‌వ‌డం విశేషం.సినిమాకు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుతున్నాయి.తాజ‌గా ఈ చిత్ర యూనిట్ మొత్త‌నికి అల్లువారి కుటుంబం ప్ర‌త్యేక పార్టీ ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఈ పార్టీకి మ‌హ‌న‌టి సినిమా టీంను మొత్త‌న్ని పిలిచి వారికి పార్టీ ఇచ్చారు.ఈ పార్టీలో మ‌హ‌న‌టి టీంతో పాటు హీరో అల్లు అర్జున్‌,ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి కూడా హ‌జ‌రైయారు.‘మహానటి’ టీమ్ నుంచి నిర్మాత అశ్వనీదత్, ఆయన కుమార్తెలు ప్రియాంక దత్, స్వప్న దత్ సహా ఇతర కుటుంబ సభ్యులు, దర్శకుడు నాగ్ అశ్విన్, కీర్తి సురేష్, విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ‘మహానటి’ ఇంత పెద్ద విజయం సాధించడం పట్ల చిత్ర యూనిట్‌కు అల్లు అర్జున్, అల్లు అరవింద్ శుభాకంక్షలు తెలిపారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -