రాంచరణ్ తో అనిల్ రావిపూడి..!

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మరో హీరోగా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతోంది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ముగియనుంది. ఈ సినిమా తరువాత చరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్ తో ఓ సినిమాలో నటించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేసేందుకు చరణ్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. కొద్దిరోజులుగా రామ్ చరణ్ సినిమాకు కథ సిద్ధం చేసేందుకు నిర్మాతలు వంశీ ప్రమోద్ లు దృష్టిపెట్టారు. అనిల్ రావిపూడి, గౌతమ్ తిన్ననూరి, వెంకీ కుడుములను కథ కోసం సంప్రదించారు. అయితే అనిల్ రావిపూడి చెప్పిన కథ వారికి నచ్చింది.

- Advertisement -

రామ్ చరణ్ కు కూడా ఈ కథ నచ్చడంతో సినిమా చేసేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్, వరుణ్ తేజ్ ల తో ఎఫ్ 3 సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తో ఓ మూవీ చేయాల్సి ఉంది. చరణ్ అనిల్ రావిపూడి తమతమ కమిట్మెంట్లు పూర్తి చేసుకున్న తర్వాత వారిద్దరి కాంబోలో సినిమా స్టార్ట్ కాబోతోంది.

Also Read

చిరు చేసిన తప్పే బన్నీ చేస్తున్నాడా..!

హీరోగా అకీరా నందన్ లాంచ్ కన్ఫామ్..

రెబల్ స్టార్ మూవీలో తొలిసారి సమంత..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -