చిన్న సినిమాగా విడుదలయ్యి బాహుబలి స్థాయిలో సత్తా చాటుతోంది ‘అర్జున్ రెడ్డి’. అయితే ఆ సినిమా సత్తా చాటింది ఎక్కడో కాదు టీవీల్లో. విజయ్‌దేవరకొండ, శాలిని పాండే ప్రధాన పాత్రల్లో సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో‘అర్జున్ రెడ్డి’ సినిమా 2017 ఆగస్టు 25వ తేదీన థియేటర్లలో విడుదలయ్యింది. ఈ సినిమా వివాదాలతోనే విడుదలకు ముందు సెన్సేషన్ అయ్యింది. ఇక విడుదలైన తర్వాత సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే సినిమా విడుదలై ఆరు నెలలు దాటినా ఇంకా అందరీ నోళ్లల్లో ఈ సినిమా విషయాలు నానుతున్నాయి. ఇప్పుడు ఇంకో విశేషమేమంటే..
సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఇటీవల టీవీలో ప్రసారమైంది. భారీ అంచనాలతో ప్రసారమైన ఈ సినిమా బాహుబలి స్థాయిలో జనాలను ఆకట్టకుంది. ప్రక్షకులందరూ టీవీలకు అతుకుపోయారు. గతవారం ఓ టీవీ ఛానెల్‌లో ప్రసారమైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా 13.6 TRP రేటింగ్ ఆ టీవీకి దక్కింది. బాహుబలి తర్వాత అత్యధిక రేటింగ్ సాధించిన సినిమాగా అర్జున్ రెడ్డి రికార్డు సాధించింది. థియేటర్లలో కనిపించిన ముద్దు సన్నివేశాలు టీవీల్లో కనిపించ లేదు. చాలా సన్నివేశాలు తీసేయడంతో కొంచెం నిరాశకు గురయ్యారు.
